కర్నూలు, మార్చి 10,
ప్పటి వరకు అక్కడ ఆ ఫ్యామిలీ అంతా ఒక్కటే. ఇప్పుడు సీన్ మారినట్టు కనిపిస్తోంది. ప్రత్యర్ధులు చేసే విమర్శలను సొంత ఫ్యామిలీయే చేస్తుండటంతో.. భూమా కుటుంబంలో చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీలో ఉంటున్న ఆ నేత టీడీపీ సీటుకు గురిపెట్టారనే వార్తలు వస్తున్నాయి. అందుకే సొంత ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టు టాక్.కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మొన్నటిదాకా రోడ్ల విస్తరణలో అవినీతి జరిగిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపణలు చేశారు. ఈ ఎపిసోడ్‌లో అఖిలతోపాటు ఆమె భర్త భార్గవ్, తమ్ముడు విఖ్యాత్‌రెడ్డిపై కేసులు నమోదు చేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అఖిల వ్యక్తిగత సహాయకుడు అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం.. మాజీ మంత్రి అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడం చర్చగా మారాయి. తాజాగా ఈ రగడలో భూమా నాగిరెడ్డి సోదరుడు భాస్కర్‌రెడ్డి కుమారుడు, బీజేపీ నేత భూమా కిశోర్‌రెడ్డి ఎంటర్ అయ్యారు. భూమా అఖిల, ఆమె భర్త భార్గవ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.బీజేపీలో ఉన్న కిశోర్‌రెడ్డి టీడీపీ సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఉంది. అందుకే అఖిలను ఆమె భర్తను టార్గెట్ చేశారట. అంతేకాదు టీడీపీ నుంచి వాళ్లను బయటకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో కేసులతో చికాకుల్లో ఉన్న అఖిల ప్రియను పార్టీ సాగనంపితే ఆ సీటు కొట్టేయాలని కిశోర్ చూస్తున్నారట. అందుకే సొంత ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకున్నారట.భూమా అఖిలప్రియ, భూమా కిశోర్‌రెడ్డి మధ్య స్థల వివాదం ఉంది. కిశోర్ స్థలం ప్రహారీ గోడను అఖిల అనుచరులు కూలగొట్టారు. దీంతో అఖిల ఆమె భర్త భార్గవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కిశోర్. వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారాయన. అఖిల భర్త ఆళ్లగడ్డలో మరో నయిమ్‌లా తయారైయ్యారని ఆయన ఆరోపించారు. ఇలాగే కొనసాగితే ఆళ్లగడ్డలో ఎవరూ వ్యాపారాలు చేయలేరని .. టీడీపీలో వాళ్లను ఎలా కొనసాగిస్తున్నారో తెలియడం లేదని.. ప్రజలను హింసిస్తున్నట్టు పార్టీకి తెలుసా అని ప్రశ్నల వర్షం కురిపించారు కిశోర్. తక్షణమే అఖిల, భార్గవ్‌లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూమా ఫ్యామిలీలో ఉన్నట్టుండి ఈ స్థాయిలో ఘర్షణ వాతావరణం రావడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.కిశోర్‌రెడ్డి ఆరోపణలతో ఒక్కసారిగా సీన్ మారింది. భూమా ఫ్యామిలీలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఊరుకుంటే బుక్ అవుతామనుకున్నో ఏమో.. భూమా విఖ్యాత్‌రెడ్డి ఘాటుగానే విమర్శలకు దిగారు. బీజేపీలో ఉంటూ ఆళ్లగడ్డ టీడీపీ టికెట్ తనదే అని కిశోర్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు విఖ్యాత్‌రెడ్డి. ఇంట్లో మహిళకే గౌరవం ఇవ్వలేని ఆయన.. ఆళ్లగడ్డలో మహిళలకు ఏం గౌరవం ఇస్తారని కిశోర్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. అయితే తానే టీడీపీ అభ్యర్థినని కిశోర్‌రెడ్డి ఓపెన్‌గా చెప్పిన దాఖలాలు లేవు. ఆళ్లగడ్డలో మాత్రం ఆ ప్రచారం ఓ రేంజ్‌లో ఉంది. కారణం ఏదైనా భూమా కుటుంబంలో రచ్చ కావడం పెద్ద చర్చగా మారింది.