YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హైదరాబాద్ అభివృద్ధికి బహుముఖ వ్యూహం మంత్రి కేటీఆర్

హైదరాబాద్ అభివృద్ధికి బహుముఖ వ్యూహం  మంత్రి కేటీఆర్

హైదరాబాద్
రాష్ట్ర రాజధాని  హైదరాబాద్ నగర అభివృద్ధికి బహుముఖ  వ్యూహాంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం నాడు అయన పలువురు శాసనసభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.  హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్ఆర్డీపీ) కింద రూ. 37 వేల కోట్లతో 70 పనులను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి వెల్లడించారు.  ఎస్ఆర్డీపీ కింద రూ. 8 వేల 52 కోట్ల 82 లక్షల కోట్లతో 47 పనులను చేపట్టాం. ఇంత వరకు రూ. 2 వేల 497 కోట్ల 93 లక్షల వ్యయంతో 27 పనులు పూర్తయ్యాయి. మిగిలిన 20 పనులు.. జీహెచ్ఎంసీ ద్వారా 17, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే శాఖల ద్వారా మూడు పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. బహదూర్ పురా ఫ్లై ఓవర్ ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.  మరోవైపు, ఓవైసీ ఫ్లై ఓవర్ ను  సెప్టెంబర్ నెలాంతానికి  అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. ఎస్ఆర్డీపీ కింద రెండో దశలో ఉప్పల్లో రూ. 450 కోట్లతో ఫ్లై ఓవర్, ఖైరతాబాద్ నియోజకవర్గంలో రెండు ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేస్తున్నాం. కార్వాన్ నియోజకవర్గంలో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్, కుత్బుల్లాపూర్లో ఫాక్స్  సాగర్ దగ్గర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఒక పాతబస్తి చార్మినార్ జోన్లో బండ్లగూడ వద్ద ఫ్లై ఓవర్, హుమర్ హోటల్ వద్ద మరో ఫ్లై ఓవర్, రాజేంద్రనగర్లో ఫలక్ నుమా నుంచి బద్వేల్ ఆర్వోబీ నిర్మిస్తున్నాం. . సికింద్రాబాద్ పరిధిలోని చిలుకలగూడ, మాణికేశ్వరి నగర్లో ఆర్యూబీలు నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Related Posts