YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

140 కిలోమీటర్ల నిరంతర పరుగు

140 కిలోమీటర్ల నిరంతర పరుగు

అనపర్తి
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి కి చెందిన పరుగుల వీరుడు రమేష్ సరికొత్త రికార్డ్ ను నెలకొల్పాడు. గతంలో 10 గంటల్లోనే 100 కిలోమీటర్లను పరుగు తీసి రికార్డ్ సృష్టించిన రమేష్... 160 కిలోమీటర్లు జాతీయ రికార్డు పై దృష్టి సారించాడు, దానిలో భాగంగానే 14 గంటల లోపు 140 కి.మీ పరుగు తీయాలని పూనుకున్నాడు, నిన్న సాయంత్రం ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, అనపర్తి శాసనసభ్యులు డాక్టర్. సత్తి సూర్యనారాయణ రెడ్డి జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు.. స్థానిక అనపర్తి  జి బి ఆర్ కళాశాల నుండి ప్రారంభమైన పరుగు కోరంగి మీదుగా యానం చేరుకుని తిరిగి అదే మార్గంలో మరల అనపర్తి జిబిఆర్ విద్యా సంస్థలకు ఈరోజు ఉదయం రమేష్ చేరుకున్నాడు. 140 కిలోమీటర్ల కు 14 గంటలు సమయం నిర్ణయించుకున్న రమేష్ నిర్ణీత సమయం కన్నా ముందే 13 గంటల సమయంలోనే 140 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. పరుగు ముగించి అనపర్తి చేరుకున్న రమేష్ ను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, జిబిఆర్ విద్యాసంస్థల అధినేత కొండబాబు  రమేష్ ను అభినందించారు.
అనతికాలంలోనే 160 కిలోమీటర్ల నిరంతర పరుగుతీసి జాతీయ రికార్డు నెలకొల్పాలని వారు రమేష్ ను కోరారు.. ఈ సందర్భంగా జిబిఆర్ వాకర్స్ క్లబ్, యోగ క్లబ్ సభ్యులు, పలువురు ప్రముఖులు రమేష్ ను సత్కరించారు..

Related Posts