YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వర్మ ‘గాడ్ సెక్స్ ట్రూత్’ స్క్రిప్ట్ నాదే..నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా

 వర్మ ‘గాడ్ సెక్స్ ట్రూత్’ స్క్రిప్ట్ నాదే..నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా

2015లో జీఎస్టీ కథ చెప్పా..!

నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్న--నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘గాడ్ సెక్స్ ట్రూత్’ (జీఎస్టీ) జనవరి 26న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే విడుదలకు ఒక్కరోజే ముందే వర్మకు కోర్టు షాకిచ్చింది. జీఎస్టీ విషయమై ఆర్జీవీ నోటీసులు అందాయి. ఆర్జీవీ తెరకెక్కించిన జీఎస్టీ షార్ట్‌ఫిల్మ్ కాన్సెప్ట్ తనదేనని రచయిత పి. జయకుమార్ కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని పరిగణలోనికి తీసుకున్న కోర్టు గురువారం మధ్యాహ్నం ఆర్జీవీకి నోటీసులు పంపింది. మూడు రోజుల్లోగా ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

2015లో జీఎస్టీ కథ చెప్పా..!
"2015 ఏప్రిల్‌ 1న ప్రస్తుతం వర్మ తెరకెక్కించిన జీఎస్టీ స్క్రిప్ట్‌ను నేను వర్మకు పంపాను. వర్మ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని చాలా రోజులుగా వేచి చూశాను. కానీ 2015 నుంచి నేటి వరకూ వర్మ నుంచి స్పందన రాకపోగా నా స్క్రిప్ట్‌ను కాపీ కొట్టి ఆయన ఏకంగా లఘు చిత్రాన్నే తెరకెక్కించేశారు. ఇటీవల వర్మ విడుదల చేసిన ‘గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ ట్రైలర్‌ చూసి షాకయ్యాను. సేమ్ టూ సేమ్ ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా తెరకెక్కించేశారు. ఇదే విషయాన్ని పిటిషన్‌లో పేర్కొన్నాను. కోర్టును ఆశ్రయించగా ఆర్జీవీకి నోటీసులు పంపడం జరిగింది. న్యాయస్థానంపై నాకు నమ్మకముంది.. నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను"అని రచయిత జయకుమార్ మీడియాకు వెల్లడించారు.

జీఎస్టీ రేపు విడుదల కాదా?
ఓ వైపు ఆంధ్రప్రదేశ్ మొదలుకుని హైదరాబాద్ వరకు ఫిర్యాదులు.. మరోవైపు బీజేపీ మహిళానేతలు, మహిళా సంఘాల ఫిర్యాదులతో ఇప్పటికే వర్మకు తలనొప్పి వచ్చినంత పనైంది. ఇవన్నీ అటుంచితే పలు టీవీ చానెల్స్‌లో వర్మ.. తమను కించపరిచినట్లుగా వర్మ మాట్లాడారని మహిళా నేతలు, సామాజిక కార్యకర్తలు కేసులు సైతం నమోదు చేయడం జరిగింది. అయితే తాజాగా రచయితే కోర్టుమెట్లక్కడంతో జనవరి 26న విడుదల కానున్న వర్మ జీఎస్టీ విడుదలవుతుందా? కాదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వర్మ ఈ నోటీసులు, జీఎస్టీ విషయంలో ఎలా ముందుకెళ్తాడో వేచిచూడాల్సిందే.

Related Posts