YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

కొలువుల జాతర కాదు…కొలువుల కుంభమేళా మంత్రి కేటీఆర్

కొలువుల జాతర కాదు…కొలువుల కుంభమేళా మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్
ఇది కొలువుల జాత‌ర కాదు.. కొలువుల కుంభ‌మేళా అని పేర్కొన్నారు. ఒకేసారి 80,039 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న చేసిన సంద‌ర్భంగా యావ‌త్ తెలంగాణ యువ‌త త‌ర‌పున సీఎం కేసీఆర్‌కు పాదాభివంద‌నం చేస్తున్నాన‌ని మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో ప‌ద్దుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు. శాస‌న‌స‌భ‌లో స‌భా నాయ‌కుడిగా సీఎం అధికారికంగా ప్ర‌క‌టించారు. మాది మాట‌ల ప్ర‌భుత్వం కాదు.. చేత‌ల ప్ర‌భుత్వం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఉత్కంఠ‌తో చూసిన ఉద్యోగ అభ్య‌ర్థులు సంబురాలు చేసుకున్నారు. విద్యార్థులు, ఉద్యోగ అభ్య‌ర్థులు చ‌దువులో మునిగిపోయారు. ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన ఓ ఇద్ద‌రు నాయ‌కులు సీఎం ప్ర‌క‌ట‌న న‌మ్మం అని స్టేట్‌మెంట్ చేశారు. కేసీఆర్ ప్ర‌క‌ట‌న న‌మ్ముతాం అనే వారు చ‌దువుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. న‌మ్మం అనే వారు మోదీ ఇస్తామ‌న్న 2 కోట్ల ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు.మాది మాట‌ల ప్ర‌భుత్వం కాదు.. చేత‌ల ప్ర‌భుత్వం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. బీజేపీ నేత‌ల మాట‌లు కోట్ల‌లో ఉంటాయి.. ప‌నులేమో ప‌కోడిలా ఉంటాయి. న‌రం లేని నాలుక క‌దా ఇష్ట‌మొచ్చిన‌ట్లు చెప్తారు. రెండు పారిశ్రామిక స‌మూహాల‌ను నిమ్జ్‌గా గుర్తించింది. ఒక‌టి జ‌హీరాబాద్‌, రెండో హైద‌రాబాద్ ఫార్మా సిటీల‌ను నిమ్జ్‌గా గుర్తించారు. దీనికి బ్ర‌హ్మాండ‌మైన మ‌ద్ద‌తు వ‌చ్చి, వేల కోట్ల నిధులు వ‌స్తాయ‌ని, కోట్ల ఉపాధి అవ‌కాశాలు వ‌స్తాయ‌ని ఆశించాం. 2016లో జ‌హీరాబాద్‌ నిమ్జ్‌కు గుర్తింపు ఇచ్చింది. ఆరేండ్ల‌లో కేవ‌లం రూ. 3 కోట్లు మాత్ర‌మే ఇచ్చింది. ఫార్మా సిటీకి నిమ్జ్ అని పేరు పెట్టి 2017లో జీవో ఇచ్చింది. ఈ ఐదేండ్ల‌లో రూ. 5 కోట్లు మాత్ర‌మే ఇచ్చింది. ఇంత‌కంటే సిగ్గుచేటు ఉంటుందా? అని అడుగుతున్నాను.కోచింగ్ సెంట‌ర్లు ఏర్పాటు చేయాలి..కోచింగ్ సెంట‌ర్లు ఏర్పాటు చేసి, పిల్ల‌ల‌కు భోజ‌న స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని ప‌లువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స‌భ వేదిక‌గా తెలిపారు. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న మీద విశ్వాసం ఉంటే, యువ‌త మీద ప్రేమ ఉంటే.. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో కోచింగ్ సెంట‌ర్లు ఏర్పాటు చేయాల‌న్నారు. దీనికి కావాల్సిన మౌలిక స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వ‌మే క‌ల్పిస్తుంద‌న్నారు. భ‌ట్టి విక్ర‌మార్క‌, శ్రీధ‌ర్ బాబు కూడా ఈ విష‌యంలో చొర‌వ చూపాలని కేటీఆర్ సూచించారు. టీ శాట్ ద్వారా పోటీ ప‌రీక్ష‌ల‌కు కోచింగ్ ఇస్తున్నాం. మాట‌ల‌తో ఎద్దెవా చేయ‌డం మంచిది కాదు. ప్ర‌భుత్వ రంగంలో ల‌క్ష ఉద్యోగాలు వ‌స్తాయ‌ని ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చెప్పాం. గ‌త ట‌ర్మ్‌లో ల‌క్షా 32 వేల పైచిలుకు ఉద్యోగాలు భ‌ర్తీ చేశాం. నిన్న‌టి ప్ర‌క‌ట‌న‌తో ఆ సంఖ్య 2 ల‌క్ష‌ల 47 వేల‌కు చేరువైంది. నినాదాలు ఇవ్వ‌కుండా.. అభివృద్ధి, సంక్షేమ‌మే ఎజెండాగా ముందుకు వెళ్తున్నామ‌ని కేటీఆర్ చెప్పారు.

Related Posts