చండీగఢ్ మార్చ్ 10
రాజ్ భవన్‌లో కాకుండా భగత్‌సింగ్ గ్రామమైన ఖట్కర్‌కలన్‌లో సీఎంగా ప్రమాణం చేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ధురీ నియోజకవర్గం నుంచి ఆప్ సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 58,206 ఓట్ల మార్జిన్‌తో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సంగ్రూర్‌లోని తన నివాసం వద్ద పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. భగవంత్ మాన్ విజయం, ఆయన ముఖ్యమంత్రి కానుడటంపై తల్లి హర్పాల్ కౌర్ భావోద్వేగం చెందారు.ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి భగవంత్ మాన్ ప్రసంగించారు. పంజాబ్ మాజీ సీఎంల ఓటమిపై విమర్శించారు. ‘బడే బాదల్ సాహిబ్ ఓడిపోయారు. సుఖ్‌బీర్ బాదల్ జలాలాబాద్‌లో ఓడిపోయారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలాలో ఓడిపోయారు. సిద్ధూ, ఆయన అనుచరుడు మజితియా కూడా ఓడిపోయారు. చన్నీ రెండు స్థానాల్లో ఓడిపోయారు’ అని ఎద్దేవా చేశారు.