టాలీవుడ్ సీనియర్ నటి వాణి విశ్వనాథ్.. మరోసారి రాజకీయాల పట్ల ఆసక్తిని తన అభిమానులకు స్పష్టం చేసారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి ఎంట్రీ తప్పదని.. తాను చిత్తూరు జిల్లా నగరి నుంచే ఎన్నికల బరిలో దిగనున్నానని చెప్పారు. ప్రజాసేవ కోసం నగరి నుంచి పోటీ చేయడం తధ్యమని ప్రకటించారు. ఏ పార్టీ నుంచి తాను పోటీ చేస్తానన్నదానిపై స్పష్టత లేకపోయినా... నగరి నుంచి బరిలో దిగుతానని అభిమానులకు తేల్చి చెప్పేసారు. నగిరిలో వేలాదిమంది అభిమానులు, అధిక సంఖ్యలో మహిళల ఆదరణ తనకుందని అభిప్రాయం తో ఉన్న రాజకీయంగా తన అభిమానులకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక పోతున్నానంటోంది. నగరి 1వ వార్డులోని శ్యామలమ్మ గుడి వద్ద స్థానిక మహిళలతో కలిసి పూజలు నిర్వహించారు.నగరితో తన కుటుంబానికి అనుబంధం ఉందని.. తన అమ్మమ్మ నర్సుగా పని చేసిందని వాణి విశ్వనాథ్ గుర్తు చేసుకున్నారు. తమిళ సంస్కృతి ఉన్న నగరి నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ప్రస్తుతం ఏ పార్టీ అన్నది చెప్పని వాణి విశ్వనాథ్.. తాను ఇండిపెండెంట్ గా పోటీ కైనా సిద్ధమంటూ రానున్న ఎన్నికల్లో పోటీకి కొసమెరుపును ఇచ్చారు. అయితే ఇప్పటికే నటి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నుంచే వాణి విశ్వనాథ్ కూడా పోటీ లో ఉంటానడంతో రానున్న ఎన్నికల్లో నగరి రాజకీయానికి మరింత సినీ గ్లామర్ తొడుకానుందన్న చర్చ నడుస్తోంది.