ఇల్లందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రవి డానియల్ పాల్గొని మాట్లాడారు. నాయకులు రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా రెండు లక్షల 56 వేల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉందన్నారు పలు కార్యక్రమాలు అప్పుల ఊబిలో ఉండే విధంగా బడ్జెట్లో ఉందని ఇది పేదలకు ఏమాత్రం న్యాయం చేయలేదని తెలిపారు.
2018 సంవత్సరం నుండి దాదాపు మూడు లక్షల దరఖాస్తులు ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నాయని వారికి మరో సారి ఆశాభంగం కలిగేలా బడ్జెట్లో కేటాయింపులు జరిగిందన్నారు.... సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతున్న తరుణంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీని అవమానించే తీరులో తెరాస నాయకులు వ్యవహరించడం ఖండిస్తున్నాను అని తెలిపారు అసెంబ్లీకి పెద్దదిక్కుగా ఉన్న స్పీకర్ తెరాస పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం శోచనీయమన్నారు.... నాలుగు కోట్ల ప్రజల గొంతుగా ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజాస్వామ్యం పట్ల విలువ లేని విధంగా తెరాస ప్రజా ప్రతినిధులు వ్యవహరించడం తగదన్నారు.
స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయల వరకు చెల్లింపులు చేస్తామన్న తీరులో ప్రచారం చేసి ఇప్పుడు బడ్జెట్లో కేవలం మూడు లక్షలు కేటాయించడం ఎంతమేరకు సబబు అని ప్రశ్నించారు ప్రభుత్వం గుత్తేదారుల తో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇల్లు గ్రామీణ ప్రాంతంలో ఐదు లక్షలు పట్టణ ప్రాంతంలో ఏడు లక్షలు ఖర్చు అవుతున్న తరుణంలో మూడు లక్షలతో పేదవాడు ఇల్లు ఎలా కట్టుకుంటారు చెప్పాలని డిమాండ్ చేశారు..... ప్రభుత్వం చేసే నిర్మాణానికి అంత భయం అయినప్పుడు 3లక్షల కేటాయింపు ఎలా చేస్తారని ప్రతి ఒక్కరికి రెండు పడక గదుల ఇల్లు వస్తాయని ఎదురుచూసిన పేదలు ప్రభుత్వ నిర్ణయంతో మరింత నిరాశ నిస్పృహలకు గురి చేసేలా ఉందన్నారు