ఉత్తరప్ర దేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి భారీ విజయాన్ని అందుకుంది. సీఎం యోగి ఆదిత్యానాథ్ రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోషించబోతున్నారు. యూపీ ప్రజలు యోగి సర్కార్‌పై నమ్మకంతో మరోసారి కాషాయ పార్టీకి అనూహ్య మెజార్టీని అందించారు. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా బీజేపీకి విజయం అందించిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. యూపీలో బీజేపీ కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంూలో బీజేపీ అద్భుత విజయం సాధించిందని కితాబిచ్చారు. తమ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు రెండోసారి తమకు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు. యూపీలో ఎన్నికలు తొలిసారి ప్రశాంతంగా జరిగాయని ప్ర శంసించారు.
పార్టీలోని ప్రతీ ఒక్కరి కృషితోనే ఈ విజయం దక్కిందన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కుట్రలు జరిగాయని ఆరోపించారు. కానీ, ప్రజలు అవేవీ పట్టించుకోకుండా బీజేపీకి విజయం అందించారని కొనియాడారు. దీంతో అందరి నోళ్లు మూతపడ్డాయని విమర్శలు గుప్పించారు. ప్రజల తీర్పుతో యూపీలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. దేశంలోనే యూపీని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతామన్నారు.