YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మార్కెట్ కు అనుగుణంగా సాగు

మార్కెట్ కు అనుగుణంగా సాగు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా   లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయం లో రైతు బంధు పధకంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కులను ఎమ్మెల్యే జలగం వెంకట రావు పంపిణీ చేసారు.  219 రైతులకు 28 లక్షలు చెక్కులను  376 పోడు రైతులకు 46 లక్షలు, 1200 మంది రైతులు  ఉంటే 219 మందికి వచ్చాయి.   ఎమ్మెల్యే మాట్లాడతూ ఏజన్సీ ప్రాంతంలో చట్టాల వల్ల సమస్యలు ఉన్నాయి.  భూప్రక్షాళన కార్యక్రమం చాలా ఆలోచన తో ,గతంలో లోపాలుఉన్న రెవెన్యూ రికార్డుల ను సరి చేసి ఎటువంటి సమస్యలు లేని భూములకు ,రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కులను రైతు బంధు పధకం ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని అందించటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గతంలో 5,6 గంటలు మాత్రమే విద్యుత్ వుండేది.నేడు 24 గంటల ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారుని అన్నారు.

గ్రామంలో రైతులకు పట్టా పుస్తకం, చెక్కులను ఇస్తున్నాం. ఒక్క పైసా ఖర్చు లేకుండా భూపట్టాదారు పుస్తకం రైతులకు అందచేయాలని లోన్ కోసం పుస్తకాలు బ్యాంక్ లో ఇతరుల వద్ద తాకట్టు పెట్ట రాదని,  పుస్తకాల్లో లోపాలు ఉంటే కేంద్రంలో ఏర్పాటు చేసిన సమస్యలు పరిష్కరించాలని అన్నారు. రైతులు వ్యవసాయం వ్యాపార దృక్పథంతో చేసి ఎకరాకు 50 వేల ఆదాయం పొందాలని,మార్కెట్ పరిస్థితిని బట్టి పంటలు సాగు చేయాలని కోరారు. నీటి వనరులు పెంచు కునేలా కృషి,గోదాముల నిర్మాణం, బ్యాంక్ ల కు 3 నెలల వ్యవధిలో మార్చు కోవచ్చు. ఆధార్ కార్డ్,పాసు పుస్తకం వెంట తీసుకు వెళ్ళాలని కోరారు. మార్పులు చేర్పులు ఉంటే  ఎమ్మార్వో  దృష్టికి తీసుకు వెళ్లి పట్టాదారు పుస్తకాలు సరి చేయించు కోవాలని కోరారు.

Related Posts