YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మారుతున్న జిల్లాలతో పోలీస్ స్టేషన్ పరిధులు

మారుతున్న జిల్లాలతో  పోలీస్ స్టేషన్ పరిధులు

విజయవాడ, మార్చి 12,
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల మార్పు జరిగిన నేపథ్యంలో ఆయా జిల్లాల పరిధిలోని పోలీసుస్టేషన్లు, సర్కిళ్లు, సబ్‌ డివిజన్లలో స్వల్ప మార్పులు చేర్పులు చేశారు. వీటికి సంబంధించి సోమవారం సర్క్యులర్‌ విడుదల చేశారు. గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కొత్తూరు, జి.సిగడం, పోలీసు స్టేషన్లను అదే జిల్లాలో ఉంచారు. శ్రీకాకుళం సబ్‌ డివిజన్‌ పరిధిలోనే వాటిని ఉంచారు. ఆర్‌.ఏ.వలస, రాజాం, సంతకవిటి, వంగర పోలీసు స్టేషన్లను విజయనగరం జిల్లాలో చేర్చి బొబ్బిలి సబ్‌ డివిజన్‌óలో కలిపారు. సీతంపేట, దొంబై, బత్తిలి పోలీసు స్టేషన్లను కొత్తగా ఏర్పడే మన్యం జిల్లాలో కలిపి పాలకొండ సబ్‌ డివిజన్‌ ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో ఉన్న రామభద్రాపురం పోలీసుస్టేషన్‌ గతంలో పార్వతిపురం సబ్‌ డివిజన్‌లో ఉండగా బొబ్బిలి సబ్‌ డివిజన్‌కు మార్చారు. బలిజపేట, సీతానగరం, ఆండ్ర స్టేషన్లను మన్యం జిల్లాలో చేర్చి పార్వతిపురం సబ్‌డివిజన్‌కు మార్చారు. విశాఖపట్నం జిల్లా పరిధిలోని పెందుర్తి, పరవాడ స్టేషన్లను కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లాలో చేర్చారు. వీటిలో పెందుర్తిని ఆనకాపల్లి సబ్‌ డివిజన్లోనూ, పరవాడను నర్సీపట్నం సబ్‌ డివిజ్లోనూ విలీనం చేశారు. కె.డి.పేట, మంప, కొయ్యూరును కొత్తగా ఏర్పాటయ్యే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిపారు. కొయ్యూరును నర్సీపట్నం డిఎస్‌పి పరిధిలోకి, మంప, కొయ్యూరును చింతపల్లి సబ్‌ డివిజన్‌కు కలిపారు. పశ్చిమగోదావరి పరిధిలో తాడేపల్లిగూడెం సిటీలో అన్ని స్టేషన్లు, పెంటపాడు, తణుకులో మూడు స్టేషన్లు, అత్తిలిని కొత్తగా ఏర్పాటయ్యే తాడేపల్లి గూడెం సబ్‌డివిజన్లో చేర్చారు. నరసాపురం సబ్‌ డివిజన్లో ఉన్న భీమవరం నాలుగు పోలీసుస్టేషన్లను భీమవరం సబ్‌ డివిజన్లోనే ఉంచారు. పాలకోడేరు, అకివీడు, ఉండి, కాళ్ల పోలీసు స్టేషన్లను భీమవరం సర్కిల్‌, సబ్‌ డివిజన్లో చేర్చారు. కొవ్వూరు పరిధిలో నల్లజర్ల, ఏలూరు పరిధిలోని భీమడోలు స్టేషన్లను కొత్తగా ఏర్పాటైన ద్వారకా తిరుమల సర్కిల్లో చేర్చి కొవ్వూరు సబ్‌ డివిజన్లో విలీనం చేశారు. ఇవి రెండూ కూడా రాజమహేంద్రవరం కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చాయి. గతంలో రాజమహేంద్రవరం కమిషనరేట్లోని గోకవరం పోలీసు స్టేషన్‌ను కాకినాడ జిల్లాలో చేర్చి పెద్దాపురం సబ్‌డివిజన్‌కు అటాచ్‌ చేశారు. రాయవరం, గొల్లపాలెం స్టేషన్లను రామచంద్రాపురం సబ్‌డివిజన్లో కలిపి కోనసీమ జిల్లాలో చేర్చారు. అనపర్తి, బిక్కవోలును రంపచోడవరం డిఎస్‌పి పరిధి నుండి తొలగించి రాజమహేంద్రవరం డివిజన్లో కలిపారు. కృష్ణా జిల్లాలో గుడివాడ పరిధిలో ఉన్న కైకలూరు, కైకలూరు రూరల్‌, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లిని ఏలూరు రూరల్‌ సబ్‌ డివిజన్లో కలిపారు. ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పాటయ్యే ఏలూరు జిల్లాలోకి వెళ్లనున్నాయి. నూజివీడు పరిధిలోని నూజివీడు, నూజివీడు రూరల్‌, ముసునూరు, ఆగిరిపల్లి, చాట్రాయిని జంగారెడ్డిగూడెం సబ్‌ డివిజన్లో చేర్చి ఏలూరు జిల్లా విలీనం చేశారు. నూజివీడు సబ్‌ డివిజన్‌ పరిధిలోని మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, ఎకొండూరు, తిరువూరు, విసన్నపేట, గంపలగూడెం పోలీసుస్టేషన్లను నందిగా డిఎస్‌పికి ఎటాచ్‌ చేసి కొత్తగా ఏర్పాటయ్యే ఎన్‌టిఆర్‌ జిల్లాలోని విజయవాడ పోలీసు కమిషనరేట్లో కలిపారు. వీరవల్లి, హనుమాన్‌జంక్షన్‌ స్టేషన్లను కృష్ణాజిల్లా గుడివాడకు ఎటాచ్‌ చేశారు. విజయవాడ పోలీసు కమిషనరేట్లోని తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఆత్కూరు, కంకిపాడు, ఉంగుటూరు, ఉయ్యూరుటౌన్‌, రూరల్‌, గన్నవరం, పెనమలూరు పోలీసు స్టేషన్లను కొత్తగా ఏర్పాటయ్యే గన్నవరం సబ్‌ డివిజన్లో కలిపి కృష్ణాజిల్లాలో విలీనం చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల సబ్‌డివిజన్లో పొన్నూరులోని రెండు స్టేషన్లను తెనాలి సబ్‌డివిజన్లో చేర్చి గుంటూరు పోలీసు కమిషనరేట్లో విలీనం చేశారు. ఇప్పటి వరకూ తెనాలి డిఎస్‌పి కింద ఉన్న వేమూరు, కొల్లూరు, చుండూరు, అమర్తలూరును బాపట్ల డిఎస్‌పి పరిధిలో కలిపారు. నరసరావుపేట పరిధిలోని ఫిరంగిపురాన్ని తళ్లూరులోనూ, పెదనందిపాడు, కాకుమానును తెనాలి సబ్‌డివిజన్లో చేర్చి గుంటూరు పోలీసు కమిషనరేట్‌కు విలీనం చేశారు. తుళ్లూరు డిఎస్‌పి పరిధిలోని పెదకూరపాడు, అమరావతి స్టేషన్‌ను సత్తెనపల్లిలో విలీనం చేసి నరసరావుపేట జిల్లాకు కలిపారు. కందుకూరు డిఎస్‌పి పరిధిలో ఉన్న కనిగిరి, హెచ్‌ఎంపాడు, పిసిపల్లి, పామూరు, సిఎస్‌పురం, వెలిగండ్ల, పొన్నలూరును దర్శి సబ్‌ డివిజన్లో చేర్చారు. దర్శి పరిధిలో అద్దంకి, బల్లికురవ, ఎస్‌.మాగులూరు, మేదరమెట్ల, కొరిశపాటు స్టేషన్లను చీరాల సబ్‌ డివిజన్లో కలిపి బాపట్ల జిల్లాకు విలీనం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు పరిధిలోని మనుబోలు పిఎస్‌ను నెల్లూరు రూరల్‌లోనూ కలిపారు. ఆత్మకూరు పరిధిలోకి కలువాయి పిఎస్‌ను గూడూరులో చేర్చి తిరుపతి పోలీసు కమిషనరేట్లో విలీనం చేశారు. రేణిగుంట డిఎస్‌పి పరిధిలోని వడమాలపేట స్టేషన్‌ను పూత్తూరు డిఎస్‌పి పరిధి కిందకు చేర్చి చిత్తూరు జిల్లాలో కలిపారు. మదనపల్లిలోని రొంపిచర్ల పిఎస్‌ను, చిత్తూరు పరిధిలోని కల్లూరు, పెనుమూరు, పూతలపట్టు స్టేషన్లను చిత్తూరు సబ్‌డివిజన్లో కలిపారు. చిత్తూరు జిల్లాలోని రామసముద్రం స్టేషన్‌ను మదనపల్లి సబ్‌డివిజన్లో చేర్చి అన్నమయ్య జిల్లాలో విలీనం చేశారు. బాకరాపేట, యర్రావారిపాలెం, పాకల, నాగలాపురం, వరదాయపాళెం, సత్యవేడు, కెవిబిపురం, పిచ్చాటూరు, నారాయణవనం స్టేషన్లను తిరుపతి కమిషనరేట్‌ పరిధిలోకి తీసుకుకొచ్చి శ్రీకాళహస్తి సబ్‌డివిజన్లో కలిపారు. కర్నూలు జిల్లాలో డోన్‌పరిధిలో ఉన్న కృష్ణగిరి, వెల్దుర్తి, పాణ్యం, గడివేముల స్టేషన్లను అదే జిల్లాలో ఉంచారు. డోన్‌ రూరల్‌, నందివర్గం స్టేషన్లను కొత్తగా ఏర్పాటయ్యే నంధ్యాల జిల్లాలో కలిపి డోన్‌ సబ్‌డివిజన్‌ కిందకు తీసుకొచ్చారు. ధర్మవరం పరిధిలోని రామగిరి, కనగానపల్లి, సి.కె.పల్లి స్టేషన్లను అనంతపురం జిల్లాలోని అనంతపురం సబ్‌ డివిజన్‌ కిందకు మార్చారు.

Related Posts