YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

తగ్గుతున్న కరోనా

తగ్గుతున్న కరోనా

న్యూఢిల్లీ, మార్చి 12,
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రెండు నెలల క్రితం భారీ స్థాయిలో నమోదై.. మూడో వేవ్ కు కారణమయ్యాయి. అయితే ప్రస్తుతం రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుదల తగ్గుముఖం పడుతోంది. దాదాపు రెండేళ్ల కనిష్ఠానికి మహమ్మారి వ్యాప్తి క్షీణించింది. దాంతో గత కొద్ది రోజులుగా 5 వేల దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 8 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 4,184 మందికి వైరస్ సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 24 గంటల వ్యవధిలో 104 మరణాలు నమోదయ్యాయని తెలిపారు. మొత్తంగా 4.29 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.  ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. బుధవారం మరో 18,23,329 డోసులు పంపిణీ చేశారు. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 179 కోట్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. తాజాగా 16,96,842 కేసులు నమోదయ్యాయి. మరో 6,708 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 60 లక్షలు దాటింది. జర్మనీలో కొత్తగా 1,91,973 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 216 మంది మృతి చెందారు. అరష్యాలో కొత్తగా 58,675 కరోనా కేసులు బయటపడ్డాయి. 645 మంది మరణించారు. మెరికాలో తాజాగా 39,200 మంది కొవిడ్ బారినపడ్డారు. మరో 1,265 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్లో కొత్తగా 49,078 మందికి వైరస్ సోకగా.. 652 మంది మరణించారు.

Related Posts