YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉద్యమ ఆంక్షాలకు అనుగుణంగా పరిపాలన

ఉద్యమ ఆంక్షాలకు అనుగుణంగా పరిపాలన

రైతులను చూస్తే నేను కూడా వ్యవసాయ భూమి కొనుక్కోవాలని బావిస్తున్నాను. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీర్ పరిపాలన కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం నాడు రేగొండలో జరిగిన రైతు బంధు కార్యక్రమంలో అయన పాల్గోన్నారు. అయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాకముందు, విద్యుత్, విత్తనాలు,పంట కు గిట్టు బాటు ధర లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు కష్టాలను కళ్లారా చూసిన కేసీర్  రైతన్న కష్టాలను పరిష్కారిం చేందుకు  అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. తెలంగాణ ఆర్ధిక పరిస్థితి బాగా లేనప్పటికీ 17 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కేసీరది అని అన్నారు. కనీసం 6 గంటల రాని పరిస్థితి నుండి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందించే స్థాయికి తెలంగాణ వచ్చింది. అయినా ..సీబీఐ కోర్టుల చుట్టూ తిరుగుతున్న ప్రబుద్దులు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు ప్రతి పక్ష నాయకులు రాక్షసుల్లా పనిచేస్తున్నారని అన్నారు. దాశరథి ,తెలంగాణ కోటి రత్నాల వీణా అంటే...సీఎం కేసీర్ కోటి ఎకరాల మాగాణి అంటున్నారు. 

స్పీకర్ .మధుసూదనా చారి మాట్లాడుతూ .గోదావరి జలాలను పంట పొలాల వైపు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుంటే... గతములో ఉన్న ఎమ్మెల్యేలు  గోదావరి ఇసుకను అమ్ముకున్నారు. ఈ తేడాను ప్రజలు గమనించాలి.  బీజేపీ ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ కానీ ఉచిత విద్యుత్ కానీ ,పెట్టుబడి కానీ ఇచ్చారా అని అడిగారు. కన్న తల్లిదండ్రులు కూడా ఆలోచించని విధంగా సీఎం కేసీర్ ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. సిఎం కేసీర్ నిండు నూరేళ్లు బ్రతకాలాని అందరూ కోరుకోవాలని అన్నారు. 

Related Posts