చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రముఖ వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అయన కు ఘనంగా స్వాగతం పలికారు. పాతాళ వినాయకుడ్ని దర్శించుకున్న పవన్ తరువాత రం సాధారణ క్యూ లైన్ లో దర్శనానికి వెళ్ళారు. ఆలయ ఈవో భ్రమరాంబ, పవన్ కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసారు. గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం నిర్వహించారు. తమ అభిమాన నటుడుని చూడటానికి వేల సంఖ్యలో అభిమానులు శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకున్నారు. తనకోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేసిన పవన్ కళ్యాణ్ ఎక్కడా ఆగకుండా వెళ్లిపోయారు.