రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలను అభివృద్ధి చేసే అవకాశం వచ్చిందని అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేస్తే రెండు నియోజకవర్గాలను దేశానికే ఆదర్శంగా నిలుపుదామని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు అయన సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల అభివృద్ధిపై గుంటూరు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో రెండు నియోజకవర్గాల ఉన్నతాధికారులతో స్పీకర్ కోడెల రివ్వూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలోని పెండింగ్ శ్శశానవాటికలను వెంటనే పూర్తి చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన నిధులు కాక నా సోంత నిధులు రెండున్నర కోట్లు ఇస్తున్నామని అన్నారు. ఎక్కడైనా నిధులు చాలకపోతే ప్రజలను భాగస్వామ్యం చేయండి. ఈ ఎండకాలంలో ఏపీవోలు లబ్ధిదారులకు జాబ్ కార్డులు ఇప్పించి ఉపాధి హామీ పనులు ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయాలని అన్నారు. ఉపాధి హామీ పనుల ద్వారా ఈ ఎండకాలంలో పంట పోలాలకు డోంకరోడ్లు, కంకరరోడ్లు అభివృద్ధి చేసుకోవాలి. మొత్తం సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని రోడ్లు టార్గెట్ గా పెట్టుకోని పూర్తిచేయాలని అదేశించారు. ఈ గ్రావెల్ రోడ్లలో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి. రెండు నియోజకవర్గాల పరిధిలో రికార్డు స్థాయిలో పూర్తిచేసిన మరుగుదొడ్లను 100శాతం వాడే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. మరుగుదొడ్లు వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. అధికారులు వారంలో ఒకరోజు గ్రామాల్లో పర్యటించి మరుగుదొడ్లు వాడుతున్నారా లేదా పరిశీలించి ప్రజలకు అవహన కల్పించాలన్నారు. తర్వాత కూడా వినని వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి పనుల నిధులు మొత్తం విడుదలౌతున్నాయని కావున మరింత ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రెండు నియోజకవర్గాల పరిధిలోని కోన్ని గ్రామాల్లో నిధులు ఉండి సైతం పనులు జరగలేదని ఆ యా గ్రామాల్లోని అభివృద్ధి పనులను రెండు, మూడు నెలలల్లో పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో ఎవ్వరైనా అభివృద్ధికి అడ్డుపడితే వారిపై చర్యలు తీసుకోవాలి. రెండు నియోజకవర్గాల పరిధిలో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలి. రెండు నియోజకవర్గాల పరిధిలోని పెండింగ్ హౌస్ లను వెంటనే పూర్తి చేయాలి. మంజూరై నిర్మించుకోని లబ్ధిదారుల స్థానంలో కోత్తవారికి మంజూరు చేయాలని అన్నారు. ప్రజా ప్రయోజనాలు ఉన్నచోట చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి... అలాంటి చోట అధికారులు ప్రజలతో కలసి పనిచేయాలి. రివ్వూలో డ్వామా పీడి శ్రీనివాస్, రెండు నియోజకవర్గాల ఎంపీడివోలు, ఎమ్మార్వోలు, పంచాయతీ రాజ్, హౌసింగ్, గ్రామీణ నీటి సరాఫరా సంస్థ అధికారులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.