తాడేపల్లి
రాష్ర్టంలో అన్ని వర్గాల అకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ కే దక్కుతుందని వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈరోజు మన పార్టీ పండుగ. నాలుగేళ్ల క్రితం అందరికి ఆశలు కల్పిస్తూ,కోట్లాది మంది హృదయాలలో ఆశలు నింపుతూ వారి ఆకాంక్షలను తీర్చిదిశగా అడుగులేస్తున్న పార్టీ మనది. వారి దీవెనలతో అదికారంలోకి వచ్చిన తర్వాత ఆశలన్నింటికి రెక్కలు తొడిగి వాటికి రూపం ఇచ్చి వాటిని తీరుస్తున్నాం. ఈ మూడు సంవత్సరాలలో మూడు దశాభ్దాల ప్రజల జీవితాలలో వచ్చిన అభ్యుధయం కనిపిస్తుంది. రాజకీయాలలో వస్తున్న సంస్కరణ,సంప్రదాయ రాజకీయాలంటే అధికారం కోసం రాజకీయం కాకుండా ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడదాం రండి అని పిలిచే రాజకీయాలకు పూర్తి రూపం ఇచ్చిన పరిస్ధితి మూడేళ్ల తర్వాత మనకు కనిపిస్తోంది. ఇది అందరికి తెలుస్తుంది.
వైయస్ జగన్ అమలు చేస్తున్న పధకాల గురించి చర్చించాలి.ప్రతి కార్యకర్త,నాయకుడు వాటి గురించి మాట్లాడాలి. వైయస్ జగన్ పేదరికాన్ని పోగొట్టేందుకు అమలు చేస్తున్న ఈ పధకాల ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. నిన్న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాద్ రెడ్డి బడ్జెట్ ప్రసంగంలో నాలుగు మూలస్ధంభాలని చెప్పారు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నేడు ఏడు దశాభ్దాల తర్వాత కూడా మహానుబావుల కల సాకారం కాలేదు.కాని వైయస్ జగన్ ఈ రెండేళ్ల కాలంలోనే వాటిని సాధ్యం చేసే దిశగా సాగుతున్నారు.ఇది కేవలం వైయస్ జగన్ కు మాత్రమే సాధ్యమైంది.కోవిడ్ కారణంగా ప్రతి కుటుంబం ఆందోళన చెందుతున్న తరుణంలో నాడు-నేడు ద్వారా విద్యా,వైద్యరంగాలలో సమూలమైన మార్పులకు కృషి ప్రారంబించారు. చదువును కొనే పరిస్ధితినుంచి ప్రతి పేద విద్యార్ధి కూడా అమ్మఒడి ప్రోగ్రామ్ తో ఆత్మగౌరవంతో చదువుకునే పరిస్ధితిని జగన్ తెచ్చారు. . ప్రతి కుటుంబం నా కుటుంబంలాగే ఉండాలనే దిశగా జగన్ ఆలోచనలు సాగుతుంటాయి. అట్టడుగు వర్గాలు,ఎస్సిఎస్టి,మైనారిటీ,బిసి వర్గాలకు రాజకీయంగా సమాజంలోని సాధికారిత తీసుకురావడంతోపాటు ముఖ్యంగా మహిళలకు నిజమైన సాధికారిత తెచ్చేవిధంగా అడుగులు వేయడం జరిగింది.50 శాతంకు పైగా రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుంది. దేశ చరిత్రలో మన కళ్లముందే జరుగుతున్న వాస్తవం. రాష్ర్టంలో మౌళిక సదుపాయాలు సామాజిక భద్రత,మానవవనరులు అంటే మనిషి జీవితానికి అబివృధ్దికి అవసరమైన అన్నింటిలో ముందంజ వేసేలా చేస్తున్నారు. గర్భంలో ఉన్న శిశువు దగ్గర్నించి ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం నుంచి విద్య,వైద్యం అందిస్తున్నాం. దీనికి సంబంధించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. గతంలో 36 లక్షల మంది విద్యార్దులు ప్రభుత్వ స్కూల్స్ లో ఉండేవారు నేడు 43 లక్షల మందికి చేరుకుంది. డిమాండ్ పెరిగింది.ప్రభుత్వస్కూల్స్ లో సీట్ల కోసం ఎంఎల్ఏ లు సిఫార్స్ లు చేయాల్సిన పరిస్దితి.డ్రాపవుట్స్ తగ్గిపోయాయి.
చంద్రన్న కానుక లేదేంటి అని అడుగుతున్నారు. అలాంటి కానుకలు ప్రకటించి వాటిని హెరిటేజ్ ద్వారా సరఫరా చేసి వాటిద్వారా కూడా దోపిడీ సాగించేవారు.అన్ని వర్గాల అవసరాలు తెలుసుకుంటూ వైయస్ జగన్ ప్రతి కుటుంబం తమ కాళ్లపై తాము నిలబడేవిధంగా అభివృద్ది చెందేలా చేస్తున్నారు. అందుకే జగన్ గారిని మరింత అక్కున చేర్చుకుని స్దానికసంస్దలలో కూడా కుప్పంతో సహా అన్నింటిలో గెలిపించారు.రాజకీయంగా మీరు అవసరం లేదు, అవశాన దశకు చేరుకున్నారని చంద్రబాబుకు ప్రజలే తమ తీర్పు ద్వారా చెప్పారు. గతంలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ ను కూడా చేతిలో పెట్టుకుని ఏడాది పాటు ఎన్నికలు జరగకుండా చేశారు. స్వార్ధానికి,ద్రోహానికి,మోసానికి మారుపేరుగా ఉన్న మూకంతా తెలుగుదేశం పార్టీవద్దకే చేరుకున్నారు.వారి కుట్రలు,కుతంత్రాల పట్ల పార్టీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరూ కూడా ప్రత్యర్ధులు కాదు. ప్రజల ఆదరణ కోసం పనిచేస్తున్నాం. నిజంగా ఆయా పార్టీలు పోటీకి దిగితే దానికి తగినట్లు అజెండా తయారుచేసి పోటీ పడాలి తప్ప, పచ్చమీడియా,లేదా వారి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ వాటి ద్వారా లాభం పొందే ప్రయత్నం చేస్తే వాటిని ఎక్కడిక్కడ తిప్పి కొట్టాలంటే ప్రజలతో మమేకం కావాలి.
తెలుగుదేశం పార్టీ లాగా జన్మభూమి కమిటీల్లాంటివి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు.అలాంటివి మా పార్టీ కార్యకర్తలు ఆశిస్తారని అనుకోవడంలేదు. ప్రజలకు సేవ చేయడంలో ఉండే తృప్తి ,గౌరవం అలాంటివి అని సగర్వంగా చెప్పుకోవచ్చు. రాష్ర్టాభివృధ్దికోసం జగన్ తో కలసి అడుగులు వేస్తున్నాం.ఇది కార్యకర్తలు నడుపుకునే పార్టీ ప్రజలను మభ్యపెట్టేపార్టీలాంటిది కాదు. ప్రజల మన్ననలు పొందుతూ వారి జీవితాలు మెరుగులు దిద్ది,రాష్ర్టాన్ని అభివృద్ది పధాన నిలిపేలా చేసే పార్టీ. చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించే పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మాయలు,చేతబడులు చేస్తూ రాష్ర్టానికి అరిష్టంలా తయారైన తెలుగుదేశం పార్టీని సమాధి చేసే దిశగా కంకణం కట్టుకుని అఢుగులు వేయాలి. టిడిపి పగటి కలలు కుంటున్నారు. నిన్న కూడా వారికి 160 సీట్లు వస్తాయని ప్రచారం చేసుకుంటున్నారు. వారు ప్రజలు నమ్మినా నమ్మకపోయినా అదే ప్రచారం చేస్తుంటారు. అమరావతి లాంటి దానిని అరచేతిలో సృష్టించినవారు ఏదైనా చేస్తారు.మనమే అలెర్ట్ గా ఉండాలి. వైయస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు.ప్లీనరీ జరుగుతుంది.సభ్యత్వ కార్యక్రమం ఉంటుంది. పార్టీ కార్యాకలాపాలు మరింతగా పెరుగుతాయి.
చంద్రబాబు 2.60 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మన ప్రభుత్వానికి అప్పగించి వెళ్లాడు. దానికి తోడు ఆరునెలల గడవకముందే కోవిడ్ లాంటి సంక్షోభం వచ్చింది. వాటిని తట్టుకుని పేదలకు సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నాం. ఇదే చంద్రబాబు అయితే గుండుసున్నా చుట్టేవాడు. పంటిబిగువున కష్టాలు భరిస్తూ ముఖ్యమంత్రి ఆదాయం తగ్గినా, ఖర్చు పెరిగినా ప్రజలకు చెప్పిన మాటలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎక్కువమందికి ప్రయోజనం కలిగించే ప్రోగ్రామ్స్ ను అమలు చేస్తున్నారు. నిన్న బడ్జెట్ చూసినా అదే కనిపిస్తుంది. ఇప్పటికి లక్షా 20 వేల కోట్ల పైన లబ్దిదారులకు నేరుగా చేర్చారు. ఇవన్నీ కూడా భాద్యతగా చేస్తున్నారు. మనం పెట్టుకున్న పధకాలు అన్నీ కూడా ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా అనేది కార్యకర్తలు చూడాలి. అదే విధంగా శ్రీ వైయస్ జగన్ తీసుకువచ్చిన సచివాలయ,వాలంటీర్ల వ్యవస్ధను ఫాలో అవుతూ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది చూడటం చేయాలి. అందులోనే మన బాధ్యత,అదికారం ఉన్నాయి. ప్రత్యర్ధులుచేస్తున్న విషప్రచారాలు,దుష్ప్రచారాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ముందుకు వెళ్లాలి. వందేళ్ల పాటు ఉండే ఈ పార్టీ ప్రజల జీవితాలలో మమేకైన పార్టీ. ఈ పార్టీలో భాగస్వామ్యం అయ్యే అదృష్టం కలిగినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ కార్యకర్తలందరికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
రాష్ర్ట ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని అన్నారు. అందరికి న్యాయం చేయలనేదే ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఆలోచన అని అన్నారు. పార్టీని ఉమ్మడి కుటుంబంలా తీర్చిదిద్దారని అన్నారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి వారసుల్లా కలసికట్టుగా పనిచేసి జగన్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగాలని కోరారు.పార్టీలో పదవుల కోసం ఆతృత పడాల్సిన అవసరం లేదు. వైయస్ జగన్ ప్రతి ఒక్కర్ని గౌరవించే మనస్తత్వం ఉన్న మంచి నాయకుడు. ఒకొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం వస్తుంది. ఎవరికి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా పార్టీని దృష్టిలో పెట్టుకుని నాయకుని అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ కోసం అందరం పునరంకితం కావాలన్నారు.
రాష్ర్ట విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త కష్టంతోనే పార్టీ బలంగా ఉందని అన్నారు. పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని పధకాలు నెరవేరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ ది అని అన్నారు. అభివృధ్ది,సంక్షేమం రెండు కళ్లుగా రాష్ర్టం ముందుకు వెళ్తోంది. పార్టీ సిద్దాంతాలు,బావజాలం అంతా కూడా పేదల సంక్షేమం ద్యేయంగా పనిచేస్తోంది. పేద,బడుగువర్గాల పార్టీ.దివంగత వైయస్సార్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోంది. అందరికి సమన్యాయంచేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజలందరూ శ్రీ వైయస్ జగన్ గారికి అండగా ఉండాలన్నారు. పార్టీలో కొంత ఆలస్యం అయినా కూడా ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు.2024లో కూడా విజయదుందుభి మోగించేలా పనిచేయాలన్నారు. శ్రీ వైయస్ జగన్ మూడు దశాభ్దాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు.
పార్టీ సీనియర్ నేత,ఎమ్మెల్సీ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, స్థాపించిన 11 సంవత్సరాల కాలంలో వైఎస్సార్సీపీ ఎంతో సాధించిందని తెలిపారు. ఇతరులు సాధించడానికి ఇంకేమీ లేకుండా చేసిందని పేర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 23 పార్లమెంట్, స్దానిక సంస్దలలో 90శాతం సాధించి కుప్పంలో కూడా టీడీపీని గల్లంతు చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెత చందంగా ప్రతిపక్షాల కుతంత్రాలకు అడ్డుకట్ట వేసి రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. రాష్ట్రంలో సంక్షేమం అంటేనే జగన్... జగన్ అంటేనే సంక్షేమంగా భేరీజు వెసుకుంటున్నారని తెలిపారు. ముందు ముందు మరింత సంచలనాత్మక ఫలితాలు సాధించేలా... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ పొలిటికల్ ఫిలాసఫీ సజీవంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆలోచనలు, ఆశయాలు సజీవంగా ఉంచడంలో 11 ఏళ్ళ పాటు పార్టీ విజయవంతమైనట్లు చెప్పారు. రాష్ట్రంలో అశేషమైన ప్రజాదరణతో పాలన ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి వైఎస్ ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఆయన జాతీయ స్థాయిలోనే సంక్షేమ రధ సారధిగా, గొప్ప పరిపాలనా «ధక్షుడిగా గుర్తింపు పొందినట్లు వెల్లడించారు. నేడు ప్రజల మేలు కోసం ఏం చేయాలన్న అంశంపై దేశంలోనే ప్రతి ఒక్కరూ ఏపీ వైపు చూస్తున్న వాతావరణం నెలకొని ఉందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న ఏకైక లక్ష్యంతో పని చేయాలని కోరారు.
తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్ పరిపాలన చూసి తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. నవరత్నాల్లో 5కోట్ల ప్రజలను ఇమిడ్చి అందరికీ లబ్ధిని చేకూర్చి అతి చిన్న వయసులోనే 40 ఏళ్ళ ఇండస్ట్రీని చావుదెబ్బ తీసిన ఘనత జగన్‌కే దక్కుతుందని కితాబిచ్చారు. దేశ రాజకీయాల్లోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తూ మహిళా సాధికారత కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో 50శాతానికి పైగా వాటా కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి కన్నా మరింత ఉన్నత పదవిని అధిరోహించాలన్న ఆకాంక్షను ఆమె వ్యక్తం చేశారు.
శాసనమండలి సభ్యులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాలంగా మృతి చెందిన తర్వాతి నాటి సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో ఆయన ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పధకాలకు పాలకులు తూట్లు పొడుస్తుంటే తట్టుకోలేక ఆయన తనయుడు వైఎస్ జగన్ ఒంటరిగా తన తల్లితో కలిసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను బతికించుకోవడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగిందని వివరించారు. వాస్తవాలు చెప్పాలంటే ఆయన పార్టీ స్థాపించిన తొలి రోజుల్లో వైఎస్సార్ వలన రాజకీయంగా, వ్యాపారపరంగా వృద్ధిలోకి వచ్చిన వారెవరూ జగన్ వెన్నంటి రాలేదనీ, వైఎస్సార్ ఆశయాల పట్ల సంపూర్ణ నమ్మకం, ఆయన రాజకీయ వారసుడైన జగన్ నాయకత్వం పట్ల విశ్వసనీయత ఉన్న లక్షలాది మంది యువత జగన్ అడుగులో అడుగేశారని తెలిపారు. కులమతాలకు అతీతంగా ఆయన్ను ఆదరిస్తూ వచ్చారని తెలిపారు. వారి నమ్మకానికి అనుగుణంగా జగన్ ముఖ్యమంత్రిగా తన పరిపాలన కొనసాగిస్తూ ముందుకు సాగడం అందరికీ గర్వకారణమని తెలిపారు.