YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రోజా..కిం కర్తవ్యం...

రోజా..కిం కర్తవ్యం...

తిరుపతి, మార్చి 14,
వెండితెర మీద హీరోయిన్‌గా నటించినంత కాలం.. వెలుగులే వెలుగులు. బుల్లి తెర మీద జడ్జిగా ఉన్నా.. అన్నీ మెరుపులే మెరుపులు. కానీ అదేం విచిత్రమో.... రాజకీయ జీవితంలో అడుగు పెట్టిన తర్వాత అన్నీ మరకలే మరకలు. ఇది నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్వగతం. 2014 ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టినా... నాటి విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా.. అధికార టీడీపీ వల్ల ఎన్నో అవమానాలు, మరెన్నో ఇబ్బందులు. ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వస్తే.. తనకు మంచి రోజులు వస్తాయని భావించిందీ ఈ ఆర్కే రోజా. కానీ ఫ్యాన్ పార్టీ అధికార పక్షంలోకి వచ్చినా.. అ స్వపక్షంలో తనకు విపక్షం తయారైందనీ ఈ రోజా తెగ ఫీలైపోతుందనే టాక్ అయితే నగరి నియోజకవర్గంలో రచ్చ రచ్చగా నడుస్తోంది. వైయస్ జగన్ కేబినెట్‌లో మంత్రి గిరి కొట్టేద్దామనుకుంది. కానీ సీఎం జగన్ వద్ద మరీ అలక బూనీ మంగళగిరిలోని ఏపీఐఐసీ చైర్మన్ పదవిని పట్టుకోంది. మరోవైపు ఎమ్మెల్యే రోజాను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ఆమె జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వచ్చిన ఏ అవకాశాన్ని వదులు కోవడం లేదు. అంతేకాదు.. రోజాను దెబ్బ తీయడానికి అవకాశాల కోసం ఆయన మరీ వేచి చూస్తున్నారనే టాక్ కూడా శ్రీవారి కొలువైన జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే నగరి నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో ఫ్యాన్ పార్టీ లీడర్ నుంచి కేడర్ వరకు అంతా ఓ వర్గంగా చేరి.. రోజాకు వ్యతిరేకంగా గుడూపుఠాణి నడుపుతున్నారన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఆమె ఓటమి కోసం.. ఇప్పటికే వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం వారికి పెద్దిరెడ్డి ధన, కనక వస్తూ రూపేణా సహాయ సహకరాలు అందిస్తున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. దీంతో తన ఓటు బ్యాంక్ గల్లంతవుతోందని రోజా ముందే ఊహించింది. నగరిలో తమిళ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వారి ఓట్లను కొల్లగొట్టేందుకు... ఇటీవల తన భర్త సెల్వమణితో కలసి ఆమె తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ అయి.. తన నియోజకవర్గంలోని తమిళులకు సహాయ సహాకారాలు అందించాలంటూ కొత్త పల్లవి అందుకోందీ రోజా. ఈ విషయాన్ని పరిశీలిస్తానంటూ స్టాలిన్ చెప్పడంతో.. ఆమె కాస్తా డీలా పడినట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని సీఎం జగన్‌కు కూడా వివరించగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలియనిది కాదంటూ ముక్తాయింపు నిచ్చీ మరీ రోజాకు క్లాస్ పీకినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సారి ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదని.. దాంతో తీవ్ర ఆలోచనలతో రోజా నలిగిపోతున్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు.   మరోవైపు.. మంత్రి పదవి వస్తే.. తన రాజకీయ ప్రత్యర్థి, మంత్రి పెద్దిరెడ్డిపై  ఓ రేంజ్‌లో హల్‌చల్ చేయవచ్చుననే ఆలోచనలో ఉందీ రోజా. కానీ ఆమె ఆశలు ఆడియాశలు అయ్యేలా ఉన్నాయని తాడేపల్లి ప్యాలెస్‌లో టాక్ వైరల్ అవుతోంది. రోజా హవా అంతా గత కాల జ్జాపకంగా మారిందనే టాక్ కూడా నడుస్తోంది. నేడు అంతా చిలకలూరిపేట ఎమ్మెల్మే రజినీదే హవా అని... ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నా.. వారు హోం మంత్ర, డిప్యూటీ సీఎంగా ఉన్నా.. వారంతా విడదల రజినీ ముందు దిగదుడుపే అనే టాక్ అయితే అమరావతిలో సైతం హల్ చల్ చేస్తోంది. రానున్న ఉగాదికి జగన్ కొత్త కేబినెట్‌ కొలువు తీరనుందని సమాచారం. ఈ కేబినెట్‌లో రజినీకి బర్త్ కన్‌ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. కానీ రోజా విషయంలో అలా కాదు.. చిత్తూరు జిల్లా రెండు జిల్లాలు అవుతున్న సందర్భంగా ఆమెకు కాకుండా కేబినెట్ బర్త్.. భూమన లేదా చెవిరెడ్డి తన్నుకు పోయే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు రానున్న ఎన్నికల్లో ఆమె గెలుపు నల్లేరు మీద నడక కాదని.. ఆమెకు కూడా తెలుసు. దీంతో రోజా రాజకీయానికి చెక్ పెట్టేందుకు పెద్దిరెడ్డి మంత్రాంగం వంద శాతం వర్క్ అవుట్ అవుతుందని చిత్తూరు జిల్లాలో జోరుగా నడుస్తోంది.

Related Posts