న్యూఢిల్లీ, మార్చి 14,
విజయానికి అందరూ మిత్రులే, పరాజయమే అనాథ..ఇది అందరికీ తెలిసిన సామెత.ఇప్పుడు అదే జరుగుతోంది.ఐదురాష్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. ఒక్క పంజాబ్’లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) గెలిచింది. ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడి పోయింది.అయినా ఈ రోజుకూ కాంగ్రెస్ పార్టీనే దేశంలో నెంబర్ టూ పార్టీ. ప్రధాన ప్రతిపక్షం. అంతే కాదు, ఎన్ని స్థానాల్లో గెలిచింది, ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అనే విషయాన్ని పక్కన పెడితే, సుమారు 200ల స్థానాలకు పైగా, బీజేపీకి పోటీగా నిలిచే కాంగ్రెస్ పార్టీ మాత్రమే,. ఈ 200 ఫై చిలుకు స్థానాల్లో బరిలో దిగే మూడో పార్టీ లేదు. కానీ,ఒక్క పంజాబ్’లో ఆప్’ విజయం సాధించడంతో, దేశ రాజకీయ ముఖ చిత్రమే మారి పోయిందనే ప్రచారం మొదలైంది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ రాత్రికి రాత్రి జాతీయ నాయకుడు అయి పోయారు. నిజమే, దేశంలో ప్రాంతీయ పార్టీలుగా పుట్టి, జాతీయ పార్టీలుగా ‘గుర్తింపు’ పొందిన పార్టీలు ఉన్నాయి కానీ, రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీ ‘ఆప్’ ఒక్కటే. అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ తర్వాత రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీయేతర రెండవ పార్టీ. ‘ఆప్’ కావడంతో, మీడియాలో ‘ఆప్’ గ్రాఫ్ పైకి పోయింది. అయితే, కాంగ్రెస్’ కు ఆప్’ ప్రత్యాన్మాయం అవుతుందా? అంటే, ఇప్పట్లో అయితే అది అయ్యే పని కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నిజానికి, ఆప్’ పార్టీ, ఆ మాట కొస్తే, ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందడం పెద్ద విషయం కాదు, కానీ, జాతీయ స్థాయిలో పోటీ చేసి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పోషిస్తున్న ప్రతిపక్ష కూటమి పెద్దన పాత్రను చేరుకోవడం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. 2024 ఎన్నికల సమయానికో లేదా 2029కో. ఆప్’ నిజంగా, జాతీయ స్థాయిలో జెండా ఎగరేయడం ఎట్టి పరిస్థితిలోనూ అ య్యేపని కాదని, అసాధ్యమని పరిశీలకులు అంటున్నారు. అయితే, ప్రస్తుతం ప్రతిపక్ష కూటమి తాడుబొంగరం లేని పరిస్థితిలో కొట్టు మిట్టాడుడుతున్న నేపధ్యంలో, పంజాబ్ ఇచ్చిన బూస్ట్’తో కేజ్రీవాల్’ జాతీయ రాజకీయాలపై ఆశలు పెంచుకుంటే పెంచుకోవచ్చును గానీ గమ్యం చేరడం మాత్రం అంత ఈజీ వ్యవహారం కాదని పరిశీలకులు అంటున్నారు. నిజానికి, కేజ్రీవాల్ పార్టీ, ఇంతవరకు వరసగా రెండు సార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో గెలిచింది. ప్రభంజనం సృష్టించింది. అయినా లోక్ సభ ఎన్నికల్లో మాత్రం అదే ఢిల్లీ నుంచి ఒక్క సీటు కూడా గెలవలేదు. 2014 లోక్ సభ ఎన్నికల్లో దేశం మొత్తం మీద 400 పై చిలుకు స్థానాల్లో ఆప్ పోటీ చేసినా, నాలుగు స్థానలకు మించి గెలవలేదు. ఉత్తర ప్రదేశ్’లో ప్రధాని మోడీఫై పోటీ చేసిన కేజ్రీవాల్’కు డిపాజిట్ కూడా దక్క లేదు. ఆప్ గెలిచిన నాలుగు స్థానాలు కుడా ఒక్క పంజాబ్’ లోనే గెలిచింది, ఢిల్లీ సహా మరే రాష్టంలోనూ బోణీ అయినా చేయలేదు. 2019 ఎన్నికల్లో పంజాబ్’తో పాటుగా మరి కొన్ని రాష్ట్రాలలో పరిమిత సంఖ్యలో కొన్ని స్థానాలలో ఆప్’ పోటీ చేసింది. అయినా పంజాబ్‌లో ఆప్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా రెండు సార్లు ప్రభంజనం సృష్టించిన అప్’ వరసగా రెండు సార్లు జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టి చేయి కాల్చుకుంది. నిజానికి ఒక్క ఆప్’ అనే కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్’ ఇలా చాలా వరకు ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలలో సాదించిన విజయాలను లోక్ సభ ఎన్నికల్లో రిపీట్ చేయడం లేదు. తెలంగాణ విషయాన్నే తీస్కుంటే, 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న బీజేపీ 2019 లోక్ సభ ఎన్నికల్లో నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకుంది. అలాగే, కాంగ్రెస్ పార్టీ మూడు లోక్ సభ స్థానాలు గెలుచుకుంది. సో ..ఒక్క పంజాబ్’ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఆప్’ అర్జెంటుగా బీజేపీని, ఫర్ దట్ మ్యాటర్ కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్ వంటి ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఢీ కొట్టే స్థాయికి చేరుకుంటుంది, అనుకోవడం, ఆశించడం, కొంచే చాలా అబ్సుర్ద్’ అనిపించుకుంటుంది.