హైదరాబాద్, మార్చి 14,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి.. వైయస్ విజయమ్మ తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పులివెందుల సాక్షిగా వైయస్ ఫ్యామిలీలో చోటు చేసుకున్న పరిణామాల పట్ల ఆమె కలత చెందుతున్నట్లు సమాచారం. ఓ వైపు తెలంగాణలో వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ..తన పాదయాత్రను పున: ప్రారంభించినా.. వైయస్ విజయమ్మ మాత్రం అంత సంతోషంగా లేరట. వైయస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలుగా.. తన కుమారుడు వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కుర్చొబెట్టేందుకు ఆమె కాదు.. ఆమె కుమార్తె వైయస్ షర్మిల కూడా ఎంత చేయాలో అంత చేశారు.. అందుకు వారు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు. ఈ విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. అయితే వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. అతని వ్యవహారశైలిలో మార్పులు చోటుచేసుకోవడంతో వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిలలు తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ సీఎం కూర్చి తనకు.. తన కాయకష్టంతో వచ్చిందనే విధంగా ప్రవర్తించడంతో.. వీరి బాగా హర్ట్ అయినట్లు సమాచారం. అదీకాక.. వైయస్ జగన్ సొంత చిన్నాన్నా వైయస్ వివేకానంద హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీని సీఎం జగన్ వెనకేసుకురావడం పట్ల వైయస్ ఫ్యామిలీలోని కీలక కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆక్షేపించినట్లు తెలుస్తోంది. దీంతో వైయస్ అవినాష్ రెడ్డికి.. సీఎం జగన్ ఒక్కరే అండగా ఉన్నారనే .. కానీ మిగతా.. వైయస్ ఫ్యామిలీలోని వారంతా వైయస్ షర్మిల వైపు ఒక్కటిగా ఉన్నారనే చర్చ అయితే పులివెందుల సాక్షిగా నడుస్తోంది. ఆ క్రమంలోనే సీఎం జగన్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండాలని వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిలలు నిర్ణయించుకున్నారని సమాచారం. అందులోభాగంగానే వైయస్ విజయమ్మ, షర్మిలలు .. పక్క రాష్ట్రం తెలంగాణకు వచ్చి... కొత్త పార్టీ పెట్టడం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే. అంతేకాకుండా.. వైయస్ జగన్, వైయస్ షర్మిలల మధ్య ఆస్తి పంపకాలలో చోటు చేసుకున్న మనస్పర్థలు వల్ల కూడా వైయస్ విజయమ్మ తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. అదీకాక.. సీఎం వైయస్ జగన్.. పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టవద్దంటూ వైయస్ షర్మిలకు చెప్పిన ఆమె అతడి మాటలకు లక్ష్య పెట్టకుండా.. పార్టీ స్థాపించడమే కాకుండా... రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు నేపథ్యంలో సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని.. వారిపై ఆమె వ్యంగ్య బాణాలు విసరడం.. ఇలా వైయస్ షర్మిల పక్క రాష్ట్రంలో చేపట్టిన ప్రతి ఒక్కటి.. సీఎం జగన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయనే చర్చ అయితే తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా నడుస్తోంది. అదీకాక తెలంగాణలో షర్మిల పార్టీ గెలుపు కోసం శ్రమిస్తానని ముందుగా మాట ఇచ్చిన ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్.. ఆ తర్వాత మడమ తిప్పి.. కేసీఆర్ పార్టీ గెలుపు కోసం వ్యూహారచనలు చేయడం.. అదీకాక.. వైయస్ షర్మిల.. గతంలో చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి అంతగా స్పందన రాలేదు. సరికదా. ఆమెకు మీడియాలో కవరేజ్ కూడా అంతగా లేకపోవడంతో.. ఆమె పాదయాత్రకు పుల్ స్టాప్ పెట్టడం మంచిది అనే చర్చ అయితే లోటస్‌పాండ్ సాక్షిగా గట్టిగానే నడిచింది. అంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం.. దాంతో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కరోనా ఉదృతం కావడంతో.. ఒకానొక దశలో షర్మిల పాదయాత్రకు పుల్ స్టాప్ పెట్టారనే చర్చ కూడా బలంగానే నడిచింది. మార్చి 11న వైయస్ షర్మిల తన పాదయాత్రను పున: ప్రారంభించారు. అయితే ఆమె పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టకపోవడం.. మీడియాలో ప్రచారం రాకపోవడం... తాజాగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. థర్డ్ ఫ్రెంట్ అంటూ గళమెత్తిన సీఎం కేసీఆర్.. ఈ ఎన్నికల పలితాలు చూసి.. యాదాద్రి వెళ్లాదామనుకున్న సీఎం కేసీఆర్.. కాస్తా అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరడం.. బీజేపీ తలుచుకుంటే.. తెలంగాణలో కూడా కషాయం రెపరెపలు ఆడించగల సత్తా ఉందని ప్రతిఒక్కరికి ఇప్పటికే క్లియర్ కట్‌గా అర్థం అయింది. మరోవైపు వైయస్ షర్మిల పార్టీకి అండ దండ.. గా కీలక వ్యక్తులు ఎవరు లేకపోవడం.. ఈ ప్రశ్నల పరంపరతో వైయస్ విజయమ్మ ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. కొడుకు వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠమెక్కినా.. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు.. మళ్లీ ఫ్యాన్ పార్టీకి బ్రహ్మరథం పడతారన్న ఆశ అయితే వైయస్ విజయమ్మకు కించిత్ కూడా లేదట. మరోవైపు పక్క రాష్ట్రంలో అటు కారు పార్టీ స్పీడ్‌కు.. కమలదళం హడావుడికి కుమార్తె వైయస్ షర్మిల పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఉందని విజయమ్మ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అదీకాక.. వైయస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలుగా వైయస్ విజయమ్మ పార్టీ స్థాపించిన నాటి నుంచి కొనసాగుతోన్నారు. కానీ ఆ పదవిని త్వరలో వైయస్ విజయమ్మ వద్ద నుంచి తీసుకుని.. సీఎం జగన్.. తన భార్యకు కట్టబెడతారన్న ప్రచారం అయితే అమరావతిలో గట్టిగానే నడుస్తోంది. ఏదీ ఏమైనా.. వైయస్ జగన్, వైయస్ షర్మిల పట్ల ఓ తల్లిగా వైయస్ విజయమ్మ పడుతున్న ఆందోళన మాత్రం ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తోంది.