YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీని గెలిపించిన మజ్లీస్

 బీజేపీని గెలిపించిన మజ్లీస్

హైదరాబాద్, మార్చి 14,
ఉత్తర ప్రదేశ్’లో బీజేపీ విజయం వెనక, ఎంఐఎం ప్రభావం వుందా? అంటే ఉందనే అభిప్రాయమే బలంగా వినిపిస్తుంది. నిజానికి, ఒక్క యూపీలోనే కాదు, దేశ వ్యాప్తంగా కూడా బీజేపీ, ఎంఐఎం మధ్య వ్యూహాత్మక ఒప్పందం ఉందనే అభిప్రాయాన్ని లౌకికవాద పార్టీలు బలంగా ప్రచారం అయితే, చేస్తున్నాయి. అయితే, లౌకికవాద పార్టీలు చేస్తున్న ఈ ప్రచారం వలన ఆ పార్టీలు ఊహించిన స్థాయిలో కాకున్నా ఎంతో కొంత మేరకు బీజేపీ ఒక్కటే కాదు, ఎంఐఎం కూడా ప్రయోజనం పొందుతోంది. లౌకిక వాద పార్టీలు చేస్తున్న ఈ ప్రచారం, లౌకిక  పార్టీలు హిందూ మతోన్మాద పార్టీగా భావిస్తున్న బీజేపీకి మాత్రమే కాదు,  ఎంఐఎం పార్టీకి కూడా పరోక్షంగా మేలు చేస్తున్నాయి. నిజానికి, ఎంఐఎం విస్తరణ దిశగా ముందుకు సాగేందుకు, లౌకికవాద పార్టీలు చేస్తున్న ప్రచారం  ఇందనంలా పని చేస్తోందని అంటున్నారు. ‘ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తాదుల్ ముస్లిమీన్ పార్టీ పేరులో ‘ఆల్ ఇండియా’ పార్టీగా  చెలామణి అవుతున్న కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఎంఐఎం, ‘పాత బస్తీ’ పార్టీ అనే అభిప్రాయమే వుంది. అది నిజం కూడా, ఎంఐఎం గతంలో ఎప్పుడూ ఓల్డ్ సిటీ గీత దాటే ప్రయత్నం చేయ లేదు. ఇంచుమించుగా గడచిన దశాబ్ద కాలంగా, ఎంఐఎం విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. యూపీ, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు  ఇలా చాలా రాష్ట్ర్లాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. పునాదులు ఏర్పాటు చేసుకుంటోంది. ఎంఐఎం తొలిసారిగా 1984లో పార్లమెంట్’లో కాలు పెట్టింది. అప్పటి నుంచి దశాబ్దాలుగా పార్లమెంట్’లో సింగిల్ మెంబర్’ పార్టీగానే వుంది. కానీ, 2019 లోక్ సభ ఎన్నికలలో సంఖ్యాబలాన్ని రెండుకు పెంచుకుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ విజయం సాధించారు. ఏఐఎంఐఎం ఆవిర్భావం తర్వాత, మొదటి సారిగా పార్లమెంట్‌లో ఇద్దరు ఎంపీలు ఉన్నారు.పార్లమెంట్’లోనే కాదు ఇతర  రాష్ట్రాల అసెంబ్లీలలో కూడా ఎంఐఎం కాలు పెట్టింది. నిజానికి, తెలంగాణ శాసన సభలో ఎంత మంది ఎంఐఎం సభ్యులు ఉన్నారో, ఇతర రాష్ట్రాలలోనూ అంతే మంది సభ్యులున్నారు. తెలంగాణ శాసన సభలో ఏడు స్థానాలున్న ఎంఐఎంకు బీహారు శాసన సభలో ఐదుగురు ఏమ్మెల్యేలున్నారు.మహారాష్ట్ర శాసన సభలో ఇద్దరు శాసన సభ్యులున్నారు. అలాగే, ఇతర రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఎన్నికలో పోటీ చేసి, అన్నో ఇన్నో స్థానాలు గెలుచుకుంది. సో... బీజేపీని గెలిపించడం కోసం, ఎంఐఎం ఇతర రాష్ట్రాలలో పోటీ చేస్తోందనే వాదనపూర్తి సత్యం కాదు. అయితే, అర్థ సత్యం కావచ్చును. ఉభయతారకంగా ఉంటుంది కాబట్టి అలాంటి లోపాయికారీ ఒప్పందం లాంటిది ఏదైనా ఉంటె ఉండవచ్చును. నిజమే, ఎంఐఎం బరిలో ఉండడం వలన ముస్లిం ప్రభావం ఎక్కువగా ఉన్న కొన్ని నియోజక వర్గాల్లో బీజేపీకి కొంత మేలు జరిగితే జరగ వచ్చును, కానీ, ఎంఐఎం కేవలం  బీజేపీని గెలిపించడం కోసమే పోటీ చేస్తోందని, లౌకికవాద పార్టీలు అనుకునే పార్టీలు,భావిస్తే అది ఆ పార్టీల ఆత్మవంచన, పలాయన వాదం అవుతుందే కానీ, నిజం కాదు.నిజానికి, లౌకిక ఓటును ముక్కలు చేస్తోంది, ఒక్క ఎంఐఎం మాత్రమే కాదు, కాంగ్రెస్ నుంచి ఆప్ వరకు, సోకాల్డ్  లౌకికవాద పార్టీలన్నీ, అదే చేస్తున్నాయి. తాజాగా యూపీ నుంచి గోవా వరకు ఐదు రాష్ట్రాల్లో కనిపిస్తున్న నిజం అది, నిజానికి డి తప్పు కూడా కాదు, ఏ పార్టీకి ఆ పార్టీ ఎదగాలనుకోవడం తప్పు కాదు. అయితే, లౌకిక పార్టీలు మేము చేస్తే సంసారం .. అన్నట్లుగా ఒక్క ఎంఐఎంను మాత్రమే తప్పు పట్టడం ఆపర్తిలు చేస్తున్న తప్పు కాదు, ఆత్మ వంచన అనుకోవచ్చును.యూపీ విషయాన్నే తీసుకుంటే, ఎంఐఎం మరో ఐదారు చిన్న చితక పార్టీలను కలుపుకుని, 100 స్థానాల్లో పోటీ చేసింది. అయినా, ఒక్క స్థానంలోనూ గెలవలేదు, ఒక్క స్థానం మినహా మిగిలిన 99 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఎంఐఎం కూటమికి వచ్చింది కేవలం 0.4 శాతం ఓట్లు వచ్చాయి. అయితే 2017 ఎన్నికలలో కేవలం 38 స్థాల్లో పోటీ చేసి 0.2 శాతం ఓట్లు మాత్రమే సాధించిన ఎంఐఎం ఈసారి 100 స్థానాల్లో పోటీచేసి 0.4 శాతం ఓట్లు సాధించింది. సో...యూపీలో గానీ, మరో రాష్ట్రంలోకానీ, బీజేపీ గెలిపిస్తోంది, ఎంఎంఎం కాదు, లౌకికవాద పార్టీల పార్టీల అనైక్యత. ఈ నిజాన్ని లౌకికవాద పార్టీలు ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిందని పరిశీలకు సూచిస్తున్నారు.

Related Posts