YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ముందస్తు ఎన్నికల వ్యూహాలు

ముందస్తు ఎన్నికల వ్యూహాలు

హైదరాబాద్, మార్చి 14,
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని, రాజకీయ, మీడియా వర్గాలో గట్టి చర్చే జరుగుతోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే, వందకు రెండు వందల శాతం, ఈ సంవత్సరం చివర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని, నెక్స్ట్ ఇయర్’ మార్చి, ఏప్రిల్’లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసన సభ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రులు కూడా ముందస్తు ఉండదని, ఆ అవసరం లేదని, రాదనీ అంటున్నారు.ఇక బీజేపీ విషయానికి వస్తే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు కానీ, ఇంకా మూడు వంతులకు పైగా స్థానాలకు అభ్యర్ధులే లేని పరిస్థితిలో బీజేపీ ముందస్తుకు మొగ్గు చూపుతుందా అనేది అనుమానమే అంటున్నారు. అసెంబ్లీ రద్దు వరకు నిర్ణయం ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుంది. అ తర్వాత ఎన్నికలు ఎప్పుడు జరపాలనేది, ‘కేంద్ర’ ఎన్నికల సంఘం చేతుల్లోకి పోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్న సమయంలో అసెంబ్లీ రద్దు చేసి, నిర్ణయాన్ని కేంద్రం చేతిలో పెట్టే విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోరననే మాట కూడా తెరాసలో వినవస్తోంది.ఎన్నికల విషయం ఎలా ఉన్నా, ముందస్తు ఫిరాయింపులకు అయితే తెర లేచినట్లే కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ తెలుగు రాష్ట్రాలపై దృష్టిని కేంద్రీకరిస్తుందని స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపధ్యంలో, అధికార టీఆర్ఎస్’లోని అసంతృప్త నేతలు, కమలం వైపు ఓ కన్నేసి ఉంచినట్లు తెలుస్తోంది. బీజీపీ కూడా తమది ‘ఓపెన్ డోర్ పాలసీ’ ని ఓపెన్’ గా ప్రకటించింది, ఎవరైనా రావచ్చని, స్వాగతం పలుకుతోంది. ఈ నేపధ్యంలో, తెరాస సీనియర్ నేతలు,పార్టీకి దూరమైన మాజీ మంత్రులు, తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెరాసలో కొనసాగితే  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దొరకదని భావిస్తున్న వారు,  తమ భవిష్యత్ కార్యాచరణ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు నాయకులు అయితే, ఇప్పటికే, ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  ఫిరాయింపుల్లో ముందు వరసలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2018ఎన్నికల్లో జూపల్లి ఓడిపోయారు. ఆయన పై గెలచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. జూపల్లిని పక్కన పెట్టారు. ఇక ఆయనకు తెరాస టికెట్ రాదని తేలిపోయింది. ఈ నేపధ్యంలోనే ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెబుతున్నారు. బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అయితే బీజేపీలో ఇప్పటికే ఆయన ప్రత్యర్థి డీకే అరుణ ఉన్నారు. అది సాధ్యమా అని చర్చలు జరుగుతున్నాయి. అయితే, గతంలో ఉన్న విబేధాలను పక్కన  పెట్టి   ఇద్దరూ కలిసి పనిచేసేందుకు అంగీకరించినట్లు బీజీపే వర్గాల సమాచారం.  ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెరాస టికెట్ వచ్చే అవకాశం కనిపించడం లేదు.పాలేరులో తుమ్మలపై  గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేంద్ర రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు.అలాగే, పొంగులేటి శ్రీనివాసరెడ్డిడి  కూడా అదే పరిస్థితి. అయితే ఈ ఇద్దరూ బీజేపీలో చేరాలా లేక కాంగ్రెస్’లోకి వెళ్ళాలా అనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని అంటున్నారు. అయితే, ముందస్తు ఫిరాయింపులు అయితే మొదలయ్యాయని చెప్పవచ్చని పరిశీలకులు అంటున్నారు.

Related Posts