విజయవాడ
కల్తీ సారా మరణాలన్నీ సీఎం జగన్ రెడ్డి చేసిన హత్యలేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. నకిలీ బ్రాoడ్ల బాగోతం వెలికితీయాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మద్యపాన నిషేధం ఏమైందంటూ ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి నిరసన ర్యాలీ చేపట్టారు. టీడీపీ శాసనసభ పక్షం రాష్ట్రంలో నాసిరకం మద్యం బ్రాండ్లు లభిస్తున్నాయంటూ మద్యం సీసాలతో అసెంబ్లీకి నిరసన ప్రదర్శన నిర్వహించారు.