విజయవాడ
ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. లక్షల టన్నుల ధాన్యం వరికల్లాల్లో ఉండడంతో రైతులు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రెండవ పంట చేతికి వచ్చే పరిస్థితి వస్తున్న తరుణం కూడా ఆసన్నమౌతోంది. ఈసందర్భంలో ప్రభుత్వం స్పష్టమైన విధానం అవలంభించడం లేదని విమర్శించారు. రైతులకు అండగా బిజెపి పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఉద్యోగాల కు సంబంధించిన నోటి ఫికేషెన్ విడుదల చేయలేదు. నీటిపారుదల శాఖ లో కీలకమైన లస్కర్ ఉద్యోగాలు దాదాపుగా మూడు వేలు ఖాళీ గా ఉన్నా ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని సోమువీర్రాజు ప్రశ్నించారు. పోలీసు, ఇతర ఉద్యోగాల కు సంబంధించిన నోటి ఫికేషన్ లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.