యాదాద్రి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే భూమిలేని నిరుపేద ప్రజలకు భూమిని పంపిణీ జరిగిందని, వినోబాభావే స్ఫూర్తితో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇందిరా గాంధీ టేనిస్ ఆక్ట్ తీసుకొచ్చి, దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూమిపై హక్కులు కల్పించారని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు . యాదాద్రి భువనగిరి జిల్లా: భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో భూదానోద్యమం ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, మధుయాష్కిగౌడ్ ప్రారంభించారు, ఈ పాదయాత్ర పోచంపల్లి నుండి మొదలై మహారాష్ట్రలోని సేవాగ్రం వరకు సుమారు 600 కిలోమీటర్లు పాదయాత్ర చేపడుతున్నామని మీనాక్షి నటరాజన్ తెలిపారు ఏప్రిల్ 14 వ తారీకు వరకు ఈ పాదయాత్ర సేవాగ్రం చేరుకుంటుందని ఆమె తెలిపారు.