విజయవాడ
స్థానిక 42వ డివిజన్ ప్రియదర్శిని కాలనీ నందు సోమవారం నాడు 30లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనంను మరియు 15 లక్షల వ్యయంతో నిర్మించినా కుండల బజారు రోడ్డు ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు.అంతరం మంత్రి మాట్లాడుతూనగరపాలక సంస్థ లో కార్పొరేటర్లు గెలిసి నేటికీ ఏడాది కాలం అవుతుందని మా కార్పొరేటర్లు అందరు ఈ ఏడాది కాలంలో వారివారి డివిజన్లలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు.దశాబ్దాలుగా పెండింగ్ లో వున్నా ఈ కుండల బజారు రోడ్డును నేడు మేము అభివృద్ధి పరిచామన్నారు.టీడీపీ హయాంలో వెయ్యలేని రోడ్డును నేడు మేము వేసి ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు.మరి కమ్యూనిటీ హాల్ కూడా ఎన్నో ఏళ్లగా పెండింగ్లో వున్నా పని దానిని కూడా మేము నిర్మించి నేడు ప్రారంభించాము. అదేవిధంగా వైయస్ఆర్ పార్కును కూడా నూతన హంగులతో అభివృద్ధి పరిచామన్నారు.ఈ సందర్భాల్లో మంత్రి పవన్ పై ఘాటుగా విమర్శించారు ఐపీల్ క్రీడాకారుల వేలంపాట మాదిరిగా పవన్ కళ్యాణ్ తన ప్యాకేజి పెంచుకోవడం కోసమే జనసేన ఆవిర్భావ సభా నిరవహిస్తున్నారన్నారు.పవన్ కళ్యాణ్ వళ్ళ ఈ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగంలేదన్నారు.తన ప్యాకేజి పెంచుకోవడం కోసం ఏడాదికి ఒకటి రొండు సార్లు ఏపీకి వచ్చే పవన్ కు ప్రజల తరుపున మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ,అవుతూ శైలజ రెడ్డి,స్థానిక కార్పొరేటర్ పగిడిపాటి చెతన్య రెడ్డి పార్టీ నాయకులూ వక్కలగడ్డ శ్రీకాంత్,బండారి వెంకట్,శీలం ఈశ్వర రెడ్డి,కేసరి కృష్ణారెడ్డి,రాజు,స్పీడ్ సుబ్బారావు మరియు నగర పాలక సంస్థ అధికారులు వివిధ కార్పొరేషన్ల చేర్మెన్లు,డైరెక్టర్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు'పాల్గొన్నారు