కడప
కడప జిల్లా చింతకొమ్మ దిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్లోపల్లి హౌసింగ్ ప్లాట్ల సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. పట్టుబడ్డ స్మగ్లర్లు గతంలో పలు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితులుగా వున్నట్లు గుర్తించారు. అంతర్రాష్ట్ర స్మగ్లర్ ల వద్ద నుంచి 34 ఎర్రచందనం దుంగలు, 2 కార్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు సమాచారం జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణా కు పాల్పడితే పి.డి యాక్ట్ ప్రయోగిస్తామని అన్నారు. . ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్టు చేసి దుంగలను స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి ఆధ్వర్యంలో రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ సెల్ ఇన్స్పెక్టర్ బి.నాగార్జున, చింతకొమ్మదిన్నె ఎస్సై మంజునాథ్ రెడ్డి, సిబ్బంది ని అభినందించి రివార్డులు అందచేసారు.