మంగళగిరి
తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేషన్ కార్యాలయం ప్రక్కన గల మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట బహిరంగంగా కొందరు మద్యం సేవిస్తున్నారు ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ మహేంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని బహిరంగ మద్యం సేవించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.