విశాఖపట్నం
వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు. విశాఖలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో బ్రదర్ అనిల్కుమార్ భేటీ అయ్యారు. విశాఖలోని మేఘాలయ హోటల్లో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశం నిర్వహించారు. బ్రదర్ అనిల్ మాట్లాడుతూ నేను పోలిటికల్ విషయాలు మాట్లాడను. ఈ సంఘాలు ఎన్నికలు ముందు ఈ ప్రభుత్వానికి సహాయం చేసారు. ఇప్పుడు వారికి ఇబ్బందులు వచ్చాయి. నేను ఎప్పుడు అసెంబ్లీ వైపు వెళ్లే వాడిని కాను. పార్టీ అంటే ఒక్క రోజులో ఏర్పాటు చేసేది కాదు. చాలా బాధ్యత తో చేసే పని అని అన్నారు. సీఎం చాలా బిజీ ఉంటారు. నా బిజీ లో నేను ఉన్నాను..సీఎం పధకాలు బిజి లో సీఎం ఉన్నారు. అరుణ్ కుమార్ ను ప్రత్యేక పని పై కలిశాను. నేను సీఎం ను కలిసి రెండున్నరేళ్లు అయ్యింది. సీఎం దగ్గరకు నేను నేరుగా వేళాలిసిన అవసరం లేదని అన్నారు. ఒక లేఖ ద్వారా తెలియజేస్తాను. క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగింది. వాళ్ళు ఒక ప్రత్యమ్నాయా పార్టీ పెట్టాలి , బిసి కి సీఎం ఇవ్వాలని అంటున్నారు వారికి అండగా నిలుస్తాను. ఎన్నికల ముందు నన్ను నమ్మి సహాయం చేసి ప్రభుత్వ ఏర్పాటు కృషి చేసారు.ఇప్పుడు వారి బాధ లో ఉంటే స్పందించే బాధ్యత నాకు ఉందని అన్నారు. వివేకా హత్య కేసులో , దోషులు తప్పించుకోలేరు. సీబీఐ కేసు విచారణ చేస్తోంది అంటే చిన్న విషయం కాదని అన్నారు.