న్యూఢిల్లీ, మార్చి 14,
నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మెయిన్ 2022 సెషన్ -1 పరీక్ష షెడ్యూల్‌లలో మార్పులు జరిగాయి. ఈ జేఈఈ మెయిన్ సెషన్ -1 పరీక్షలు మొదటి దశ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి జరగాల్సిన పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4వ తేదీల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. బోర్డు పరీక్షలు, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా సీబీఎస్‌ఈ టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభం కానున్నాయి.ఈ గొడవల కారణంగా నేషనల్ టెస్టింగ్ సూచనల మేరకు ఏజన్సీ జేఈఈ మెయిన్ 2022 సెషనల్1 పరీక్ష షెడ్యూల్ తేదీలను మార్చడం జరిగిందని ఎన్‌టీఏ అధికారిక నోటీసులో పేర్కొంది. జేఈఈ మెయిన్ 2022 కోసం దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు మార్చి 31వ తేదీ వరకు jeemain.nta.nic.inలో ఇంజనీరింగ్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని జాగ్రత్తగా పూరించాల్సి ఉంటుంది. ఎందుకంటే నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ఫారమ్‌లో ఎటువంటి సవరణలు ఉండవు.