YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాజీనామాలకు గాంధీలు సిద్ధం...

రాజీనామాలకు గాంధీలు సిద్ధం...

న్యూఢిల్లీ, మార్చి 14,
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం  జరిగింది. పార్టీ వరుస వైఫల్యాల నేపథ్యంలో గాంధీ కుటుంబం త్యాగాలకు సిద్ధమైంది. పార్టీ కోసం తమ పదవులకు రాజీనామా చేసేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ముందుకొచ్చారు.  అయితే వారి నిర్ణయాన్నికాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తిరస్కరించింది.  గాంధీ కుటుంబం రాజీనామా చేయాలని ప్రతిపాదించగా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దీనిని ఏకగ్రీవంగా తిరస్కరించిందని పార్టీ సీనియర్ నేత  అధిర్ రంజన్ చౌదరి వెల్లడించారు. పార్టీ కోసం తమ పదవులను త్యాగం చేయడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సుముఖత వ్యక్తం చేశారని ఆయన  వెల్లడించారు. అయితే మేమంతా ఈ ప్రతిపాధనను తిరస్కరించామని ఆయన తెలిపారు.ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీకి తీవ్ర ఆందోళన కలిగించేవి అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పేర్కొంది. దాదాపు నాలుగున్నర గంటల సమావేశం తర్వాత మీడియాతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీ సోనియా గాంధీ నాయకత్వంపై తన విశ్వాసాన్ని ఏకగ్రీవంగా పునరుద్ఘాటిస్తుంది.  ముందుండి నాయకత్వం వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడిని అభ్యర్థిస్తోంది. బలహీనతలు, రాజకీయ సవాళ్లను స్వీకరించడానికి అవసరమైన సమగ్రమైన సంస్థాగత మార్పులు.సోనియా గాంధీ తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టి సంస్థను పునరుద్ధరించి, బలోపేతం చేస్తారని ఆయన తెలియజేశారు. కెసి వేణుగోపాల్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ప్రసంగించిన కాంగ్రెస్ నాయకుడు ఆర్ సూర్జేవాలా మాట్లాడుతూ.. సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు పార్టీకి సోనియా గాంధీ మార్గనిర్దేశం చేయాలని సిడబ్ల్యుసిలోని ప్రతి ఒక్క సభ్యుడు కోరుకుంటారు.2024 లోక్‌సభ ఎన్నికలలో తమ అవకాశాలను పునరుద్ధరించుకోవాలని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తృణమూల్ కాంగ్రెస్‌ల నుండి ఎదురవుతున్న సవాల్‌ను తిప్పికొట్టాలని ఆశించిన కాంగ్రెస్‌కు ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి.

Related Posts