హైదరాబాద్, మార్చి 15,
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే ఏమవుతుంది? అందులో ఉన్న పాలో, పెరుగో నేల పాలవుతుంది. అయితే, ఎందుకనో గానీ, తెరాస నాయకులు, చివరకు కేసీఆర్, కేటీఆర్’ కూడా కేంద్రం పుట్టలో వేలు పెడుతున్నారు. బీజీపీ మీద పెరుగుతున్న కోపతాపాలను, సైన్యం మీద చూపించి విమర్శలు కొని తెచ్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి కేసేఆర్, సరిహద్దులో చైనా సేనలను నిరోధించడంలో మన సైన్యం విఫలమైందనే అర్ధం వచ్చేలా, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విమర్శలు ఎదుర్కున్నారు. అలాగే సర్జికల్ స్ట్రైక్స్’ విషయంలోస్ట్రైక్స్ విషయంలో రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్ధించి మరోమారు, విమర్శలు ఎదుర్కున్నారు. అదలా ఉంటే ఇప్పుడు కేటీఆర్, కంటోన్మెంట్ ఏరియాకు కరెంట్, నీళ్లు ఆపేస్తామని హెచ్చరించారు. అదికూడా అసెంబ్లీ సాక్షిగా,కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టే క్రమంలో సైన్యం పైనా ప్రత్యక్ష విమర్శలు చేశారు. కంటోన్మెంట్ ఏరియాలో ఇష్టమొచ్చినట్టుగా రోడ్లు మూసివేస్తే ఊరుకోమని, ప్రజల కోసం తాము ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు. కంటోన్మెంట్ ఏరియాలో నాలాలపై చెక్ డ్యాములు కట్టడంవల్ల కాలనీలు మునిగిపోతున్నాయని, ఎన్నిసార్లు చెప్పినా అక్కడ అధికారుల తీరు మార్చుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల కోసం తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే కంటోన్మెంట్ కు నీళ్లు, కరెంటు కట్ చేస్తామని కేటీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులతో ఆఖరుసారి చర్చలు జరపాలని వినకపోతే నీళ్లు, కరెంటు కట్ చేయాలని అసెంబ్లీలోనే ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీకి మంత్రి కేటీఆర్ ఆదేశాలిచ్చారు.కేటీఆర్ చేసిన హెచ్చరిక పట్ల ఇటు రాజకీయ ప్రత్యర్ధుల నుంచే కాకుండా, సామాన్య ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. తప్పయినా, ఒప్పయినా సైన్యాన్ని చులకనచేసి మాట్లడితే, సామాన్యులు కూడా సమర్ధించరు. అలాంటిది మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా సైన్యానికి హెచ్చరికలు జారీ చేయడాన్ని, సామాన్య ప్రజలు కూడా సైన్యాన్ని అవమానించడంగానే చూస్తున్నారు. అదే సమయంలో ఓల్డ్ సిటీ’లో విద్యుత్ చార్జీలు వసూలు చేయడం చేతగాని, ప్రభుత్వం కంటోన్మెంట్ కరెంట్, వాటర్ సప్లై ఆపేస్తామని హెచ్చరించడం రాజకీయంగానూ వివదాస్పదం అయింది. మరో వంక కేంద్ర రక్షణ శాఖ కూడా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్’గా తీసుకున్నట్లు తెలిస్తోంది. మరోవంక రాష్ట్ర బీజేపే నాయకులు కూడా కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారారు. బీజేపీ నాయకత్వం రాజకీయంగా ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే, ముఖ్యమంత్రి కేసేఆర్ చైనా సరిహద్దులో మన సైన్యం విఫలమైందని చేసిన వ్యాఖ్యలు, సర్జికల్ స్ట్రైక్స్’పై అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా సైన్యాన్ని అవమానించారని ఆరోపిస్తున్న బీజేపీకి కేటీఆర్ మరో అస్త్రాన్ని అందించారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో ఎప్పుడో ఎంపీగా ఉన్నరోజుల్లో కేసీఆర్ కుమార్తె, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఒక ఇంటర్వ్యూలో, “జమ్ము కశ్మీర్, తెలగాణ భారత దేశంలో అంతర్భాగం కాదు” అంటూ చెప్పినట్లు వచ్చిన వార్తలపై దుమారమే చెలరేగింది. ఇందుకు సంబంధించి బీజేపే లీగల్ సెల్ కన్వీనర్ కే. కృష్ణ సాగర్, స్థానిక కోర్టులో వేసిన పిటీషన్’ పై న్యాయస్థానంలో విచారణ జరిగింది. చివరకు కవిత క్షమాపణలు కూడా చెప్పి నట్లు గుర్తు. ఒక విధంగా చూస్తే తెరాస అగ్ర నేతలు బీజేపీ ఎక్కడ కెలక కూడదో అక్కడ కెలికి అనవసర సమస్యలు సృష్టించు కుంటున్నారని తెరాస నాయకులే, అంటున్నారు.