YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నాలుగురోజుల్లో రొయ్యల ధర నిర్ణయం నెలన్నరగా రోజురోజుకు తగ్గుతున్న ధరలకు కళ్లెం

నాలుగురోజుల్లో రొయ్యల ధర నిర్ణయం        నెలన్నరగా రోజురోజుకు తగ్గుతున్న ధరలకు కళ్లెం

 కొంతకాలంగా రోజురోజుకు తగ్గుతున్న రొయ్యల ధరలపై సాగు రైతు నష్టపోకుండా వచ్చే శుక్రవారం కల్లా ఒక ధర నిర్ణయం చేసి ఆ ధరకే వచ్చే నెలాఖరు వరకు కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిలకడ లేని ధరల వల్ల రొయ్యల సాగు నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ రైతుల ఆందోళన గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అమరావతి సచివాలయంలో రొయ్యల సాగు రైతులు, ఎగుమతిదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మార్కెటింగ్, గిడ్డంగులు, పశుగణాభివృద్ధి, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ, సహకారశాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మత్స్యశాఖ ఉన్నతాధికారులు, ఎంపెడా అధికారులు కూడా పాల్గొన్నారు. ఎంపెడా అధికారులతో గురువారం చర్చించి శుక్రవారం ఇటు రైతుకు, అటు ఎగుమతిదారులకు నష్టం లేని ధరను నిర్ణయించాలని ఈ సమావేశం నిశ్చయించింది. అంతర్జాతీయ విపణిలో ధరల తగ్గుదల భారీగా ఉంటే తప్ప ఈ నిర్ణయించే  ధరలో మార్పులుండరాదని కూడా  సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు.సాధారణంగా జనవరి నుంచి జూన్, జూలై వరకు రొయ్యలకు డిమాండ్ తగ్గి ధర తగ్గుతుందని, అయితే ఈ ఏడాది ధర దారుణంగా పడిపోయిందని రైతులు ఈ సమావేశంలో వివరించారు. నెలలోనే మూడుసార్లు ధర తగ్గిపోయిందని ఇప్పుడు 100 కౌంట్ కు కిలో రూ. 160 అంతకన్నా తక్కువే ఎగుమతిదారులు చెల్లిస్తున్నారని తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా 28 శాతం మేర ధర తగ్గిపోయిందని సమావేశంలో రైతులు వివరించారు. ఉత్పత్తి వ్యయం కూడా రాకపోవడమే కాక భారీగా నష్టపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఇదే కొనసాగితే క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల నిలకడ లేకపోవడానికి ఈ సమావేశంలో  కారణాలను విశ్లేషించగాయాంటీబయాటిక్స్ వినియోగం ఉన్నాయంటూ యూరోపిన్ యూనియన్, ఆస్ట్రేలియా మన దేశ ఎగుమతుల్ని నిలిపివేయడంతో మన ఎగుమతి మార్కెట్ తగ్గింది. అయితే అదే సమయంలో అమెరికాకు 20 శాతం ఎగుమతులు పెరిగినాసరఫరాకు తగిన డిమాండ్ లేదు. చైనా మన రొయ్య కొంటున్నా తక్కువ ధర అయితేనే కొనుగోలుకు ఆసక్తి చూపుతోంది తప్ప ధర ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అదే సమయంలో ఇండోనేషియా, ఫిలిఫైన్స్, థాయ్ లాండ్, వియత్నాం, ఈక్వెడార్ లలో ఉత్పత్తి పెరిగి అవి మన దేశ ఎగుమతులతో పోటీ పడుతున్నాయి. మిగిలిన దేశాల ఉత్పత్తులను యాంటీబయాటిక్స్ వాడకం అంటూ నిలిపివేసినా నెలల వ్యవధిలోనే ఆయా దేశాలు ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ తో సంప్రతింపులు జరిపి వారి సూచనలకు అనుగుణంగా సర్టిఫికేషన్ జత చేయడానికి ఆమోదించి ఎగుమతుల్ని పునురుద్దించుకుంటున్న అంశాన్ని ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఇదే రీతిలో మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయా దేశాధినేతలతో సంప్రతింపులు జరిపి ఎగుమతుల్ని పునరుద్ధించేలా చర్యలకు రాష్ట్రప్రభుత్వం కృషిచేయాలని నిర్ణయానికి వచ్చారు. బుధవారం జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించి ముఖ్యమంత్రి చేత కేంద్రప్రభుత్వానికి, సంబంధిత మంత్రికి లేఖ రాయడమే కాక అనుశీలన జరిగేలా కృషి జరిగేలా చూస్తానని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈ సమావేశంలో ప్రకటించారు. రొయ్యల ధర అంతర్జాతీయ మార్కెట్లో ఏలా ఉందన్నది  ప్రతి 100 గంటలకో సారి ప్రకటించాలని మంత్రి  ఎంపెడా అధికారిని ఆదేశించి అమలుచేయాలని స్పష్టం చేశారు.అంతర్జాతీయ మార్కెట్ ధరను ప్రతి రోజు ప్రకటించడం సాధ్యం కాదని వివరాలు పరిశీలించాక మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. యాంటీబయాటిక్స్ వాడకం అన్ని దశల్లో నిలిపివేయాలని మంత్రి పునరుద్ధాఘిటిస్తూ వాడకం, తయారీదారులపై కఠిన చర్యలుంటాయని తెలిపారు. అమరావతి నుంచి బృందాలను పంపి తనిఖీలు చేస్తామని, తయారీదారులైనా, వాడకం దారులైనా ఎవరినీ వదలిపెట్టమని క్రిమినల్ కేసుతో పాటు తీవ్రతను బట్టి పి.డి చట్టం కూడా ప్రయోగిస్తామని పశుసంవర్ధక,మత్స్యశాఖల ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. రొయ్యల సాగు రైతులకు విద్యుత్ సరఫరా నాణ్యత మరింత మెరుగయ్యేందుకు వీలుగా 132 కె.వి. 220 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ల పెంపునకు కూడా బుధవారం నాటి మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేలా చూస్తానని మంత్రి ఆదినారాయణ రెడ్డి సమావేశంలో ప్రకటించారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్ నాయక్, అదనపు కమీషనర్ సీతారామరాజు, ఎంపెడా సంయుక్త సంచాలకులు అనిల్ కుమార్, ఎం.ఎల్.సి బీద మస్తాన్ రావు, ఉభయగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి రొయ్యల సాగు రైతులు, ఎగుమతిదారులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రి వరకు ఈ సమావేశం జరిగింది.

Related Posts