హైదరాబాద్, మార్చి 15,
ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించాలని హైకోర్టు స్పీకర్‌కు సూచించిందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తమ సస్పెన్షన్‌పై స్పీకర్‌ను కలవనున్నట్లు ఈటల పేర్కొన్నారు. చట్టసభలు సమావేశాలు జరిపి ప్రజా సమస్యలను చర్చించాలన్నారు. పార్లమెంట్ సమావేశాలు 150 రోజులు, అసెంబ్లీ సమావేశాలు 80 రోజులపాటు సమావేశం అవుతాయన్నారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా ప్రజా సమస్యలపై చర్చిస్తారని గుర్తుచేశారు. స్పీకర్‌గా ఎన్నికైన వారు ఏ పార్టీకి సంబంధిచిన వారుగా ఉండరని.. కానీ ఈ స్పీకర్ సీఎం కనుసన్నల్లో నడుస్తున్నారన్నారు. అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగం లేదని నిరసన తెలిపితే.. తమని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. కానీ అసలు కారణం అది కాదంటూ పేర్కొన్నారు. బీజేపీ వారు ఉంటే వారి ఆటలు సాగవని బయటికి పంపించారంటూ మండిపడ్డారు. ముఖ్యంగా తనను అసెంబ్లీకి రాకుండా చేయాలని సీఎం కేసీఆర్ చూశారన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని తనను మాట్లాడకుండా చేయాలని బయటికి పంపించారంటూ విమర్శించారు. సభానియమాలను ఉల్లంఘించిన సీఎంను సస్పెండ్ చెయ్యాలి.. కానీ తమని కాదంటూ పేర్కొన్నారు.దేశ్‌కి నేత కేసీఆర్ అని వివిధ రాష్ట్రాల్లో వందలకొట్ల ఖర్చు పెట్టి పేపర్ యాడ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారంటూ విమర్శించారు. ఇటీవల బీజేపీ మీద అనేక విమర్శలు చేసిన కేసీఆర్.. 5 రాష్ట్రాల ఫలితాల తరువాత ఎక్కడ పడుకున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. బంగాళాఖాతంలో వేయాల్సింది కేసీఆర్ ప్రభుత్వాన్ని అని.. మోదీ ప్రభుత్వాన్ని కాదంటూ పేర్కొ్న్నారు. హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం తాము అసెంబ్లీకి వెళతామని.. 9 గంటలకు స్పీకర్‌ను కలుస్తామంటూ పేర్కొన్నారు. దోపిడీ చేయకపోతే, అక్రమాలు చేయకపోతే ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రానికి డబ్బులు ఎలా పంపిస్తారు. అన్నీ వేల కోట్లు మీకు ఎలా వచ్చాయంటూ నిలదీశారు. ఇది దుర్మార్గ పాలన అని, ముఖ్యమంత్రిని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. తమని సస్పెండ్ చేసినట్టే వారిని కూడా తెలంగాణ ప్రజలు సస్పెండ్ చేస్తారంటూ ఈటల రాజేందర్ మండిపడ్డారు.