YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దేశ రాజకీయాలపై కశ్మీర్ ఫైల్స్..

దేశ రాజకీయాలపై కశ్మీర్ ఫైల్స్..

శ్రీనగర్, మార్చి 15,
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, సహజంగానే బీజేపీ శ్రేణులలో ఒక విధమైన ఉత్సాహాన్నినింపాయి. అదే విధంగా ఐదింట నాలుగు రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించడం విపక్ష పార్టీలను, నాయకులను కొంత షేక్ చేసింది. టీపీసీసీ చీఫ్’ రేవంత్ రెడ్డి సహా విభిన్న పార్టీల నాయకులు అనేక మంది అన్నట్లుగా ఎంతకాదన్నా, బీజేపీ విజయం, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్’లో బీజేపీ సాధించిన గెలుపులో ‘హిందూ ఓటు బ్యాంక్’ కీలక పాత్రను పోషించింది. ఇది కాదన లేని  నిజం. ఎన్నికల ఫలితాలు వెలుడిన వెరీ నెక్స్ట్ డే, మార్చి 11న  విడుడలైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ఇప్పుడు సినిమా రంగలో కంటే రాజకీయ వర్గాల్లోనే ఎక్కువగా చర్చకు వస్తోంది. ఎందుకంటే, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం కథ, కల్పిత కథ కాదు, వాస్తవం. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని అవిష్కరించిన, నిజ జీవిత కథా చిత్రం, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం. మూడు దశాబ్దాల క్రితం, 1990లలో కశ్మీర్’లో జరిగిన మతోన్మాద నరమేధాన్నితెరకెక్కించిన చిత్రం, ‘ది కాశ్మీర్ ఫైల్స్’. అదలా ఉంటే ఈ సినిమా విడుదలైన సమయం, దేశ రాజకీయ చర్చ, పొలిటికల్ నెరేషన్’ లో సినిమా కథను చేర్చింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఇతర సమస్యలు అన్నీ పక్కకు పోయి, మతం కీలకంగా మారిన నేపధ్యంలో, విడుదలైన,‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం రాజకీయవర్గాల్లో, ఎవరు ఎటు? అనే చర్చకు తలుపులు తీసింది. అదే ప్రశ్నను రాజకీయ పార్టీల ముందుంచింది. అందుకే, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం పై మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగతున్నా, ఒక్క బీజేపీ మినహా మిగిలిన పార్టీలు ఏవీ కుడా ఒక క్లియర్ స్టాండ్ తీసుకోలేదు. బీజేపీ మాత్రం, హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోయేందుకు సినిమాను చక్కగా ఉపయోగించుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు బీజేపీ రాష్ట అధ్యక్షడు బండి సంజయ్ వరకు బీజేపీ నాయకులు సాముహికంగా సినిమా చూసి, సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్నారు. ఆ విధంగా హిందూ, హిందూ వ్యతిరేక రాజకీయ చర్చకు, వివాదానికి తెర తీశారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో 80:20 ( హిందూ వెర్సెస్ ముస్లిం) భాషను మాట్లాడిన బీజేపీ, సంఘ్ (ఆర్ఎస్ఎస్) సంస్థలు ఉద్దేశపూర్వకంగానే, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి ఫ్రీ పబ్లిసిటీ కలిపిస్తున్నాయి. ప్రతి హిందువు చూడవలసిన చిత్రం అంటూ సినిమాకు ప్రచారం చేయడంతో పాటుగా, దేశంలో హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరవక పోతే, కశ్మీర్’లో జరిగిన నరమేధం దేశం అంతటా జరుగుతుందని, ఒక విధమైన భయాన్ని హిందువుల నరనరాల్లో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాయి.  
మరోవంక, కాంగ్రెస్, వామ పక్ష పార్టీలు సహా లౌకికవాద పార్టీలు ఏవీ కూడా, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం విషయంలో వ్యూహత్మకమో ఇంకొకటో కానీ, మౌనంగా ప్రేక్షక పాత్రను పోషిస్తున్నాయి. చివరకు, రాజ్యాంగ ప్రవేశికలో, ‘లౌకిక వాదం’ అనే పదాన్ని,రాజ్యాంగ సవరణన ద్వారా చేర్చిన కాంగ్రెస్ పార్టీ కానీ, మతం అంటే మత్తు మందు, అని సూత్రీకరించిన వామ పక్ష పార్టీలు కానీ, చివరకు హిందూ గాళ్ళు బొందు గాళ్ళు అంటూ, బీజేపీ  హిందూ మతోన్మాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించే తెరాస పార్టీ కానీ, ఎవరూ కూడా నోరు విప్పడం లేదు. కాదు, కేరళ కాంగ్రెస్ శాఖ, 1990-2007 మధ్యకాలంలో పండిట్ల కంటే ఎక్కువ మంది ముస్లింలు హత్యకు గురయ్యారని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ చేసిన ట్వీట్’ ను కొద్ది సేపటికే తొలిగించారు. అంటే, యూపీలో హిందూ ఓటు బ్యాంక్ ‘కన్సాలిడేట్’ అయిన నేపధ్యంలో కాంగ్రెస్ సహా లౌకికవాద పార్టీలు మెల్ల మెల్లగా దిశ మార్చుకుంటున్నాయా? హిందుత్వ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాయా? ఇప్పటికే కాంగ్రెస్ మొదలు తృణమూల్ వరకు సాఫ్ట్ హిందుత్వ బాటలో కొంత దూరం నడిచాయి...అయినా, ఆశించిన ఫలితాలు రాలేదు. సో ..ఇక ఒక్కొక్క పార్టీ సాఫ్ట్ నుంచి హార్డ్ కోర్ హిందుత్వ వైపుకు అడుగులు వేస్తున్నాయా, అంటే అవునని అనలేము, కాదని అనలేము. కానీ, మైనారిటీ ముస్లిం ఓటు బ్యాంక్ అంత బలంగా కాకపోయినా, మెజారిటీ హిందూ ఓటు బ్యాంకు పటిష్టమవుతోందని, రానున్న రోజుల్లో ఈ ప్రభావం ఎన్నికల ఫలితాలను మరింతగా ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts