కీవ్ మార్చ్ 15
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోమంగళవారం ఉదయం భారీ పేలుళ్లు సంభవించాయి. పలు చోట్ల పేలుళ్లు నమోదు అయ్యాయి. రష్యా తెల్లవారుజామున కీవ్ నగరంపై అటాక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడెక్కడ ఆ పేలుళ్లు జరిగాయో ఇంకా స్పష్టంగా తెలియదు. కీవ్ శివారు ప్రాంతాలకు చేరుకున్న రష్యా దళాలు.. తెల్‌ోవారుజామున దాడులకు దిగినట్లు తెలుస్తోంది. కీవ్ నగరంలోని పశ్చిమ శివారు ప్రాంతంలో రెండు భారీ పేలుళ్లు నమోదు అయినట్లు స్థానిక ఉక్రెయిన్ 24 ఛానల్ పేర్కొన్నది. కీవ్ సమీపంలోని బోర్స్‌చగోవ జిల్లాలో ఈ పేలుళ్లు జరిగాయి. బెలారస్ నుంచి మిస్సైళ్లను ఫైర్ చేసి ఉంటారని భావిస్తున్నారు. మారియపోల్ నగరంలో భారీ నష్టం జరిగింది. ఆ నగరానికి చెందిన శాటిలైట్ ఫోటోలను రిలీజ్ చేశారు.వీకెండ్ సమయంలో రష్యా దళాలు తమ దూకుడును తగ్గించినట్లు అమెరికా అధికారులు చెప్పారు. మారియపోల్ నుంచి శరణార్థులను 160 కార్లలో తరలిస్తున్నారు. మరో వైపు ఉక్రెయిన్, రష్యా మధ్య నాలుగవ దఫా శాంతి చర్చలు ఇవాళ రెండవ రోజు కూడా జరగనున్నాయి. ఉక్రెయిన్‌లోని అనేక నగరాలపై పేలుళ్లతో రష్యా విరుచుకుపడుతోంది. డోనెస్కీలో ఉక్రెయిన్ మిస్సైల్ వల్ల 20 మంది జనం చనిపోయినట్లు రష్యా రక్షణశాఖ ఆరోపించింది.చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ స్టేషన్‌లో మళ్లీ విద్యుత్తు సరఫరాను పునరుద్దరించారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది.