హైదరాబాద్ మార్చ్ 15
తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపుతున్న కేంద్ర వైఖరిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎండగట్టారు. తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? అని కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా? కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.