మంథని,
కెసిఆర్ ప్రభుత్వనికి పతనం ప్రారంభమయిందని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి గ్రామం లో మంగళవారం జెండా ఆవిష్కరణ ఆ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథిగా వివేక్ వెంకటస్వామి హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు బిజెపి పార్టీ లో చేరారు. వీరికి మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి, బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి లు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర లో బాత్ రూమ్ లు, రోడ్డు లు, రైతు వేదికలు, స్మశాన వాటికలు నిర్మించిందని,కెసిఆర్ ప్రభుత్వం కుటుంబ పాలన చేస్తుందన్నారు. రాష్ట్ర లో పూర్తి స్థాయిలో డబల్ బెడ్ రూమ్స్ ఇల్లులు ఇవ్వలేదని, అన్నారు.అనంతరం సునిల్ రెడ్డి మాట్లాడుతూ మంథని ప్రాంతంలో తెరాస, కాంగ్రెస్ లు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. తెలంగాణ ఉద్యమనికి జీవితన్ని త్యాగం చేసిన నాకు అన్యాయం చేసారని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ ఉద్యమన్ని అణిచివేసింది శ్రీధర్ బాబు అని, పుట్ట మధు ఏ ఒక్క రోజు తెలంగాణ కి మద్దతు ఇవ్వలేదని అన్నారు. ఈ అవినీతి, అరాచక పాలన కి చరమ గీతం పాడె రోజులు దగ్గర ఉన్నాయని, తెరాస ప్రభుత్వం కమిషన్ ల ప్రభుత్వం అని విమర్శించారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు వేల్పుల రాజు,గ్రామ శాఖ అధ్యక్షులు శైలేటి బాపు, మండలం ప్రధాన కార్యదర్శిలు వీరావేన రాజేందర్, తోట మధుకర్, సీనియర్ నాయకుడు సత్య ప్రకాష్, టౌన్ ప్రెసిడెంట్ ఎడ్ల సదా శివ, చిలువేరి సతీష్, సబ్బాని సంతోష్, పోతారవేణి క్రాంతికుమార్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.