YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ

నకిలీ కార్డీయాలజిస్టు గుట్టు రట్టు

 నకిలీ కార్డీయాలజిస్టు గుట్టు రట్టు

మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నకిలీడాక్టర్ భాగోతం బయటపడింది. సరైన అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్న ఆసుపత్రి పై జిల్లా వైద్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉక్రెయిన్ లో ఎండి చేసిన ఓ వైద్యుడు ఇండియన్ కౌన్సిల్ అర్హత పరీక్ష రాయకుండానే కార్డియాలజిస్ట్ గా కొనసాగుతున్నాడంటూ ఆరోపణలు రావడంతో డీఅండ్ఎంహెచ్వో  అదికారులు జిల్లా కేంద్రంలోని శ్రీనిది ఆస్పత్రిపై దాడులు జరిపారు. శ్రీనిది ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ గా కొనసాగుతున్న డాక్టర్ కృష్ణమూర్తి తప్పుడు దృవీకరణ పత్రాలతో వైద్యం చేస్తున్నట్టుగా గుర్తించారు. ఎంబిబిఎస్ కు సమానమైన విదేశీ ఎండి సర్టిఫికేట్ తో వైద్యం చేస్తూ రోగుల ఆరోగ్యంతో చలాగాటం ఆడుతున్నాడని.. డాక్టర్ కృష్ణమూర్తి వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కు రిపోర్ట్ పంపిస్తున్నట్టుగా తెలిపారు జిల్లా వైద్యశాఖ అధికారి కొమురం బాలు. తప్పుడు దృవపత్రాలతో వైద్యం చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

Related Posts