అమరావతి
అసెంబ్లీలో టీడీపీ సభ్యులు హుందాగా ఉండాలి. 55 వేల జనాభా ఉన్న చోట ఎవరైనా సారా కాస్తారా అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం అయన శాసనసభలో మాట్లాడుతూ అక్రమ మద్యాన్ని అడ్డుకోవడానికి ప్రత్యేక వ్యవస్థ తెచ్చాం. నిఘా ఎక్కువుగా ఉన్న చోట సారా కాయడం సాధ్యమా..? ఏదైనా మారుమూల ప్రాంతాల్లో నాటు సారా కాస్తారంటే నమ్మొచ్చని అన్నారు. సారా కాసే వారి మీద ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది. చంద్రబాబు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారు. సాధారణ మరణాలపై తప్పుడు రాజకీయం చేస్తున్నారు. నాటు సారా కాసేవారిపై రెండేళ్లలో 13 వేల కేసులు పెట్టాం. జరగని ఘటనను జరిగినట్లు చూపించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. కొన్ని మీడియా సంస్థలతో కలిసి చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని అయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని చంపే కుట్ర జరుగుతోంది. ప్రతిపక్షం సలహాలు ఇవ్వండి..మేం నోట్ చేసుకుంటామని అయన అన్నారు.