విజయవాడ, మార్చి 16,
ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ విస్తరణపై గత కొంతకాలంగా చర్చ సాగుతోంది.. దీనికి ప్రధాన కారణం.. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని సీఎం జగన్ చెప్పడమే.. ఇప్పటికే ఆ సమయంలో దాటడంతో.. ఇదో విస్తరణ..! విస్తరణ అప్పుడే అంటూ కథనాలు వస్తున్నాయి.. అయితే, వైసీపీఎల్పీ సమావేశంలో దానిపై క్లారిటీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరిస్తానని చెప్పానని గుర్తుచేసుకున్న ఆయన.. దీంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా చేపడతామన్నారు.. పార్టీ అనేది మీరు, నేను అందరం కలిసి నిలబెట్టుకున్న పార్టీ అని గుర్తు ఉంచుకోవాలని సూచించిన సీఎం.. మంత్రివర్గంలో నుంచి పక్కనపెడుతున్నట్టుకాదు.. వారికి పార్టీ బాధ్యతలు, జిల్లా అధ్యక్షపదవులు, రీజినల్ కో–ఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగిస్తున్నామని వెల్లడించారు.మంత్రులుగా పనిచేసినందున వారికి ప్రతిష్ట పెరుగుతుంది… పార్టీని నడిపించే శక్తి ఉంటుందన్నారు సీఎం వైఎస్ జగన్.. మీరు గెలవండి, పార్టీని గెలిపించుకుని రండి.. మళ్లీ మీకు అవకాశాలు వస్తాయన్న ఆయన.. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతుందని తెలిపారు. పార్టీ బాధ్యతలు అనేవి.. ఈ వ్యవస్థలో ఒక భాగం.. ఇప్పుడు మంత్రులుగా వచ్చేవారు.. మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.. తలా ఒక చేయి వస్తేనే మనం గెలవగలుగుతాం, అధికారంలోకి రాగలుగుతామన్న ఏపీ సీఎం.. ఎరినైనా మంత్రి పదవులనుంచి తప్పిస్తున్నానంటే.. వారికి మరింత బాధ్యత అప్పగిస్తున్నట్టు అని స్పష్టం చేశారు. తప్పుదు అనుకున్న చోట, కొన్ని సామాజిక సమీకరణాల వల్ల కొన్ని కొన్ని మినహాయింపులు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉంటాయన్నారు. ఇక, 26 కొత్త జిల్లాలకు అధ్యక్షులను తీసుకుంటామని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్.. వారంతా పార్టీ వ్యవస్థాగత కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని.. డోర్ టు డోర్ చేయకపోతే.. సర్వేల్లో మీ పేర్లు రావు అంటూ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. సర్వేల్లో రాకపోతే మొహమాటం లేకుండా మీకు టిక్కెట్లు కూడా నిరాకరిస్తాను అని హెచ్చరించిన సీఎం.. మనం గెలవాలి.. అది మరిచిపోవద్దు అని సూచించారు.. జుట్టు ఉంటేనే ముడేసుకోవచ్చు.. లేకపోతే.. ఎలా? అని ప్రశ్నించిన ఆయన.. కోవిడ్‌వచ్చినందు వల్ల … ఇంతకుముందుకన్నా.. ప్రజలకు కాస్త దూరంగా ఉండి ఉండొచ్చు.. కోవిడ్‌వల్ల ఎవరి దగ్గరకు వెళ్లాలన్నా.. కష్టం అయ్యింది.. ప్రజలు మనల్ని కలవాలంటే.. మన ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఇప్పుడు ఆ పరిస్థితి పోవాలన్నారుమరోవైపు, చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనన్ని పనులు చేశామని తెలిపారు సీఎం జగన్.. సంతృప్తకర స్థాయిలో కాలర్ ఎగరేసుకుని… మనం ఇదీ చేశాం అని చెప్పుకునే పరిస్థితి మనకు ఉందన్న ఆయన.. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ మిస్‌కాకుండా పథకాలు అందించాం.. చిరునవ్వుతో, ఆనందంగా ప్రజల దగ్గరకు వెళ్లగలుగుతాం అన్నారు.. ఇంతమంది ప్రజల జీవితాలను మార్చగలిగామనే తృప్తి మనకు ఉందని.. భవిష్యత్ తరాలు మన గురించి కచ్చితంగా చెప్పుకునేలా పనిచేశామన్న ఆయన.. శాచ్యురేషన్‌లో నాన్న ఒక అడుగు ముందుకేస్తే.. మనం నాలుగు అడుగులు ముందుకేశామని.. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందించామని.. మనం గర్వంగా ప్రజల దగ్గరకు వెళ్లగలం అన్నారు సీఎం జగన్.