YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

50 మందికి సిట్టింగ్ గల్లంతు

50 మందికి సిట్టింగ్ గల్లంతు

విజయవాడ, మార్చి 16,
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉంది. అయితేనేం రాజకీయ నేతల్లో హడావిడి అప్పుడే మొదలైంది. ముఖ్యంగా ఏపీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్లో యాభై మందికి ఈసారి ఎన్నికల్లో సీట్లు గల్లంతవుతున్నాయా… ఇప్పుడు వైసీపీలో ఇదే గుసగుస వినిపిస్తోంది.. ఈ యాబైమంది ఎవరూ అనేదానిపై వైసీపీ ఎమ్మెల్యేల్లో హార్ట్ బీట్ పెరుగుతోంది. పార్టీ నేతల పనితీరుపై ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రహాస్యంగా చేయించిన సర్వే రిపోర్టు ఇప్పడు పార్టీ నేతల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలెట్టేశారు ఏపీ సీఎం జగన్. అందుకే, సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మంత్రివర్గంలోని మెజారిటీ మంత్రులను తప్పించి కొత్తవారిని అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రీజనల్ కమిటీలు ఏర్పాటు చేయడం వంటివి జరుగుతున్నాయి. అయితే వీటితో పాటు మరో షాకింగ్‌ నిర్ణయం కూడా తీసుకున్నారట సీఎం జగన్‌. ఇప్పుడదే నిర్ణయం.. పార్టీ ఎమ్మెల్యేల్లో భయం పెంచుతోంది. ఓ యాభై మంది ఎమ్మెల్యేలపై సీఎం జగన్‌ బాగా ఫోకస్‌ పెట్టినట్లు పార్టీవర్గాలు చెప్పుకుంటున్నాయి. మరీ వారికి ఈసారి సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించారట. పనితీరు సరిగా లేకపోవడం, అవినీతి ఆరోపణలు, నియోజకవర్గంలో ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి చాలా అంశాలపై రిపోర్టులు తెప్పించుకున్న సీఎం… ఆ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశం ఇవ్వొద్దని డిసైడయ్యారంట. అయితే వాళ్లు ఎవరనేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.వచ్చే ఎన్నికల్లో వేటు పడేదెవరిపై? అనే అంశంలో ఎమ్మెల్యేలు తెగ టెన్షన్‌ పడిపోతున్నారు. ఆ లిస్టులో తమ పేరు ఉంటుందా? అనే ఆందోళన ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. అందుకే, సీఎంవోనుంచి సమాచారం తెలుసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ఎమ్మెల్యేలు. ఈసారి సీటు ఊస్టయ్యే ఎమ్మెల్యేల్లో మొదటిసారి గెలిచిన 30మంది, సీనియర్ ఎమ్మెల్యేలు 12మంది, మహిళా ఎమ్మెల్యేలు 8మంది ఉన్నారట. పనితీరు సరిగాలేకపోవడం వల్ల ఈసారి వాళ్లు పోటీ చేసినా గెలిచే అవకాశం లేదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో క్యాండేట్‌ను మార్చాలని జగన్‌ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొత్తవారికి అవకాశమిస్తే వారు మరింత ఉత్సాహంగా పని చేయడంతో పాటు ఆ సీటు చేజారకుండా ఉంటుందని సీఎం భావిస్తున్నారట.పార్టీలో ఉంటూనే.. ఈసారి అటూ ఇటూ అయితే, వేరే పార్టీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నవారినీ ఒక కంట కనిపెడుతున్నారట జగన్‌. పార్టీ పట్ల కమిట్మెంట్ తో ఉండకుండా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నవారిపై సీఎంవో కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. అయితే వేటుపడే సిట్టింగుల సంఖ్య యాభైతో ఆగుతుందా? జాబితా పెరుగుతుందా అనే టెన్షన్ కూడా నేతల్లో మొదలైంది.

Related Posts