విజయవాడ, మార్చి 16,
ఉగాదికే ఏపీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ. కొందరికి పదవీ గండం. మరికొందరు పార్టీ కోసం. కేబినెట్ నుంచి అవుట్స్ చాలానే ఉండబోతున్నాయంటూ టాక్. అదే సంఖ్యలో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు సీఎం జగన్. రెడ్లకు ప్రాధాన్యం కొనసాగిస్తూనే.. ఇటీవల బీసీ సీఎం అంటూ ఆయన బావ.. బ్రదర్ అనిల్ పేల్చిన బాంబుతో ఈసారి బీసీలకు మరింత ప్రాధాన్యం దక్కబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే జాబితా సిద్ధం కాగా.. అనిల్ స్టేట్‌మెంట్ తర్వాత వాటిలో మరిన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నట్టు తాడేపల్లి వర్గాల సమాచారం. జిల్లాల వారీగా వీరికే ఛాన్స్ అంటూ పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మంత్రి మండలి రేసులో ఉన్న ఆ ఆశావహుల జాబితా ఇలా ఉంది.....
చిత్తూరు జిల్లా : ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి
కడప జిల్లా: సి.రామచంద్రయ్య, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు
కర్నూలు జిల్లా: శిల్పా చక్రపాణిరెడ్డి, హఫీజ్ ఖాన్
అనంతపురం జిల్లా: తోపుదుర్తి సూర్య ప్రకాశ్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, ఉష శ్రీ చరణ్, రామచంద్రారెడ్డి, కేతిరెడ్డగి వెంకటరెడ్డి
నెల్లూరు జిల్లా: మేకపాటి కుటుంబ సభ్యుల్లో ఒకరిని మంత్రిని చేసి 6 నెలల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారని తెలుస్తోంది, ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి
ప్రకాశం జిల్లా: సుధాకర్ బాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మహీధర్ రెడ్డి
గుంటూరు జిల్లా: ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి
కృష్ణాజిల్లా: కె. పార్థసారథి, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, జోగి రమేష్
పశ్చిమగోదావరి జిల్లా: తానేటి వనిత, ఎం. ప్రసాదరాజు, బాలరాజు, గ్రంధి శ్రీనివాస్
తూర్పుగోదావరి జిల్లా: దాడిశెట్టి రాజా, పొన్నాడ సతీష్
విశాఖ జిల్లా: గుడివాడ అమర్నాథ్, బి. ముత్యాల నాయుడు
విజయనగరం: కోలగట్ల వీరభద్ర స్వామి, రాజన్న దోర
శ్రీకాకుళం జిల్లా: తమ్మినేని సీతారాం