YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముందుకు మూడు... వెనకకు ఆరు.. వివేకాహత్య కేసు

ముందుకు మూడు... వెనకకు ఆరు.. వివేకాహత్య కేసు

కడప, మార్చి 16,
మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై నేటికి అంటే మార్చి 15కు మూడేళ్లు. ఆయన మూడో వర్థంతి సందర్భంగా పులివెందులలోని వైయస్ వివేకా ఘాట్‌లో ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె వైయస్ సునీత, అల్లుడు ఎన్ రాజశేఖరరెడ్డిలు మాత్రమే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేకా ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయితే మిగిలిన వైయస్ ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులు ఎవరు వివేకా ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పించకపోవడం గమనార్హం. మరోవైపు ఈ హత్య జరిగి మూడేళ్లు అయినా.. ఈ కేసులో నిందితులను ఇప్పటి వరకు పట్టుకోకపోవడంపై వివేకా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యలో పాత్రధారులు ఎవరన్న సంగతి తెలిసినా.. సూత్రధారులు ఎవరన్నదీ.. ఇంకా క్లారిటీ రాకపోవడం ఏమిటని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు.   అయితే ఈ హత్య కేసులో నిందితులు ఎవరనేది మాత్రం బహిరంగ రహస్యం అనే చర్చ అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా హట్ హాట్‌గా సాగుతోంది. 2019, మార్చి 14 అర్థరాత్రి అంటే మార్చి 15వ తేదీ వివేకానందరెడ్డిది గుండె పోటు అంటు తొలుత వార్తలు రావడం.. ఆ తర్వాత ఆయనను గొడ్డలితో అత్యంత పాశవికంగా హత్య చేశారంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే ఆయన హత్య.. తొలుత నుంచి వివాదాస్పదమైందీ. వివేకా సొంత సొదరుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఈ కేసు ఛేదించలేకపోవడం పట్ల ప్రపంచంలోని తెలుగు వారంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే వివేకా తనయ వైయస్ సునీత, ఆమె తల్లి వైయస్ సౌభాగ్యమ్మలు వేర్వేరుగా హైకోర్టులో వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించాలని పిటిషన్లు వేయడం.. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ... కోర్టు ఆదేశాలు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అంతేకాదు.. సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టిన తర్వాత.. దర్యాప్తు కొద్దిగా స్లోగా సాగినా.. ఆ తర్వాత స్పీడ్ అందుకోంది. ఈ కేసులో వివేకా మాజీ డ్రైవర్ దస్తాగిరి అప్రూవర్‌గా మారి ఈ హత్యకు సూత్రధారులు ఈ హత్యలో పాత్రధారుల పేర్లతోపాటు సుపారీ సైతం వివరించడంతో ప్రపంచంలోని తెలుగు వారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.ఆ తర్వాత ప్రత్యర్థి వర్గం రంగంలోకి దిగి ఓ పథకం ప్రకారం.. పలువురు వ్యక్తులు తెరపైకి తీసుకు వచ్చి.. వివేకా హత్యను దర్యాప్తు చేస్తున్న సీబీఐపైనే, ఆ సంస్థ అధికారులపైనే కాకుండా... వివేకా కుమార్తె, అల్లుడుపైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు ఈ వివేకా హత్య కేసు దర్యాప్తు ఎటు వెళ్తుంతో కూడా ప్రజలెవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సీబీఐ కొన్ని రోజులు సైలెంట్ అయి.. ఆ తర్వాత ఒక్క సారిగా దర్యాప్తును జెట్  స్పీడ్ పెంచింది ఆ క్రమంలో సీబీఐ డీఐజీ సైతం నేరుగా కడప సెంట్రల్ జైలుకు వచ్చి.. ఆక్కడి గెస్ట్ హౌస్‌లో ఈ కేసు విచారణను చేపట్టారు. అందులోభాగంగా ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటిసులు జారీ చేస్తే. వారు అందుకునేందుకు నిరాకరించారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ హత్య కేసులో  సూత్రధారులను అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధమైందంటూ.. ఆ క్రమంలో కడప జిల్లాలో ఎక్కడ శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో సీబీఐ చర్చలు సైతం జరిపిందనే చర్చ కూడా నడిచింది. అలాగే సుపారీ కింద కోట్ల రూపాయిలు చేతులు మారినట్లు గ్రహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ కేసును సీబీఐ సాధ్యమైనంత త్వరగా ఛేదిస్తోందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. మరీ ముఖ్యంగా వైయస్ వివేకా కటుంబ సభ్యులతోపాటు, ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నది మాత్రం సుస్పష్టం.

Related Posts