అమలాపురం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వినాయకుడి విగ్రహం మాయం అయింది. అమలాపురం పట్టణం మహిపాలవీధిలో వినాయక విగ్రహన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. మహిపాల వీధి ప్రధాన రహదారి వద్ద ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం బయట మూడు అడుగుల విగ్రహాన్ని పెట్టాడారు. ఆలయం మూసివేసిన తరువాత వచ్చే భక్తులు దర్శించుకునేందుకు వీలుగా బయట పెట్టారు. దుండగులు ఆలయం బయట ఉన్న పైపు హ్యాండిల్ ను విరగగొట్టి విగ్రహంను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు గుర్తించారు.