YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాంగ్రెస్ లో ప్రక్షాళన షురూ...

కాంగ్రెస్ లో ప్రక్షాళన షురూ...

న్యూఢిల్లీ, మార్చి 16,
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ ఇచ్చాయి… అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు రాకపోవడం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేసే అంశం కాగా… బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.. ఇక, ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకుంది కాంగ్రెస్‌ అధిష్టానం.. ఇప్పటికే జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ రాజీనామాకు సిద్ధపడ్డారు.. కాంగ్రెస్‌ పార్టీ కోసం అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రటించారు. రాజీనామా చేయకుండా సోనియాను వారించిన నేతలు.. మీపై మాకు పూర్తివిశ్వాసం ఉందని ప్రకటించారు.. అయితే, ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్‌ అధిష్టానం ప్రక్షాళన ప్రారంభించింది.అందులో భాగంగా ఘోర ఓటమి పాలైన ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ… ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పేర్కొన్నారు.. ఇక, మరిన్ని చర్యలకు కూడా సిద్ధం అవుతోంది కాంగ్రెస్‌ అధినాయకత్వం.. త్వరలో మరిన్ని చర్యలు, పూర్తి ప్రక్షాళన ఉంటుందని సంకేతాలు ఇస్తున్నారు.. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, గోవా పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్, మణిపూర్ పీసీసీ చీఫ్‌ నమీరక్పామ్ లోకేన్ సింగ్, ఉత్తరాఖండ్ నుండి గణేష్ గోడియాల్, ఉత్తరప్రదేశ్ నుండి అజయ్ కుమార్ లల్లూ రాజీనామా చేయాలని జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. ఇప్పటికే వరుస ఓటములు.. మరోవైపు జీ23తో సవాళ్లను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌.. ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రక్షాళన ప్రారంభించింది.. మరి, ఇది పార్టీకి కలిసివస్తుందా? లేదా? నెగిటివ్‌ ఫలితాలను చూపిస్తుందా? అనేది మాత్రం వేచిచూడాల్సిన అంశం.

Related Posts