YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఇందిరా బాటలో సోనియాగాంధీ...

ఇందిరా బాటలో  సోనియాగాంధీ...

న్యూఢిల్లీ, మార్చి 16,
కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్రగల పార్టీ. ఎన్నో సంక్షోభాలను చూసింది. అవరోధాలను అధిగమించింది. అయితే, ఇప్పుడు ఎదుర్కుంటున్న గడ్డు పరిస్థితి ముందెన్నడూ, చూసింది కాదు, విన్నది కాదు. సో... ఇక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం కాదుకదా, అదులో పావు వైభవం కూడా మళ్ళీ పొందే పరిస్థితి లేదు, నో ... ఛాన్స్. ది రైటింగ్ ఆన్ ది వాల్ ఈజ్ వెరీ క్లియర్... గోడ మీద రాత చాలా స్పష్టంగా వుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసిన నేపధ్యంలో, గత కొద్ది రోజులుగా దేశ రాజకీయాల్లో ఇలాంటి చర్చ చాలా జోరుగా సాగుతోంది. అయితే, నిజంగా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తిరిగి పొందుతుందా, మళ్ళీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా, అనే విషయాన్ని పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ గతంలోనూ ప్రస్తుతం ఎదుర్కుంటున్న సక్షోభాన్ని మించిన సంక్షోభం ఎదుర్కుందని, చరిత్ర చెపుతోంది.అత్యవసర పరిస్థితి అనంతరం, 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీఅధికారం కోల్పోవడమే కాదు,  ప్రధాని హోదాలో సొంత నియోజక వర్గం రాయ్’బరేలి నుంచి పోటీ చేసిన ఇందిరా గాంధీ, అమేథీ నుంచి పోటీ చేసిన ఆమె కుమారుడు సంజయ్ గాంధీ ఇద్దరూ ఓడి పోయారు.ఆ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ అనుకూల వ్యతిరేక వర్గాలుగా చీలి పోయింది. ఇదిరాగాంధీ వ్యతిరేక వర్గం, ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. అంతవరకు ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో హోమ్ మంత్రిగా ఉన్న కాసు బ్రహ్మనంద రెడ్డి పార్టీ అధ్యక్షుడయ్యారు. అయితే ఇందిరాగాంధీ, పార్టీ అధ్యక్ష పదవిని తిరిగి దక్కించుకునేందుకు, శత విధాలా ప్రయత్నించారు. అయినా, ఫలితం లేక పోవడంతో, చివరకు పార్టీని చీల్చేందుకు సిద్దమయ్యారు. ముందుగా, 20 మంది సభ్యులున్న, జాతీయ కార్యవర్గం సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. ఆమె వెంట 1977 డిసెంబర్ 7 మరో ఏడుగురు సభ్యులు రాజీనామా చేశారు. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. దీంతో, కాంగ్రెస్ పార్టీ 1969 చీలిక తర్వాత మళ్ళీ అంతటి సంక్షోభ పరిస్థితిని ఎదుర్కుంది. నిజానికి 1969 చీలిక సమయంలో కూడా, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీనే పార్టీని వదిలి వెళ్ళారు. మెజారిటీ సభ్యులను తమ వెంట తిప్పుకుని పార్టీని హస్త గతం చేసుకున్నారు. అలాగే, 1977 సంక్షోభ  సమయంలోనూ ఇందిరా గాంధీ, అదే ఫార్ములాను ఫాలో అయ్యారు.పార్టీ పదవికి  రాజీనామ చేసిన కొద్ది రోజులకే ఇందిరా గాంధీ పార్టీలోని తమ  మద్దతుదారులతో, పార్టీని బలోపేతం చేసే పేరున సమావేశం ఏర్పాటు చేశారు. చరిత్ర పునరావృతం అయింది.
ఇందిరా గాంధీ ఏర్పాటు చేసిన సమ్మేళనాన్ని భగ్నం చేసేందుకు  బ్రహ్మానంద రెడ్డి వర్గం అన్ని ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు బ్రహ్మనంద రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకుడు వైబీ చవాన్,   ఇందిరా గాంధీ మీద విరుచు పడ్డారు. “ ఇందిరా గాంధీ వల్లనే పార్టీలో సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ తమ ఆధిపత్యాన్ని నిలుపుకుని, పార్టీని తమ గుప్పిట్లో బంధీని చేసేందుకు, ఇందిరా గాంధీ సంక్షోభం సృష్టించారు” అంటూ ప్రకటనలు చేశారు. ఆమె వెంట వెళ్ళవద్దని విజ్ఞప్తులు చేశారు. అయిన 1978 జనవరి 1 న ఇందిరా గాంధీ ఏర్పాటు చేసిన సమ్మేళనం సక్సెస్ అయింది.
ఇక ఆ తర్వాత ఏమి జరిగింది నేడు చరిత్ర. ఇందిరా గాంధీ, కాంగ్రెస్ (ఇందిర) పేరిట సొంత పార్టీ పెట్టి, సంవత్సరం తిరగకుండానే, మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వాన్ని విజయవంతంగా కూల్చి వేశారు. ఎన్నికల్లో విజయం సాధించి, అధికారాన్ని, హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దికాలానికే రెడ్డి కాంగ్రెస్ అంచెలంచెలుగా ఇందిరా కాంగ్రెస్’లో కలిసి పోయింది. ఇందిరా కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్’గా మళ్ళీ గుర్తింపు పొందింది.  అయితే, ఇప్పుడు కూడా అదే పరిస్థితి వుందా? ఇందిరా గాంధీ అడుగు జాడల్లో సోనియా గాంధీ, అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, రాహుల్, ప్రియాంక సారధ్యంలో కొత్త కాంగ్రెస్’కు ప్రాణం పోస్తారా? అంటే, రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చును అంటున్నారు.

Related Posts