హైదరాబాద్, మార్చి 16,
తెలంగాణలో ఓ వంక ముందస్తు ఎన్నికల ఉహాగానాలు ఊపందుకున్నాయి. వచ్చే (2023) సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అదలా ఉంటే, పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల సన్నాహాలకు శ్రీకారం చుట్టాయి. ఎన్నికల సందడి మొదలైంది. ముందుగా వ్యూహ కర్తలను బరిలో దిగుతున్నారు. జనంనాడి పట్టుకుని వ్యూహరచన చేసేందుకు సిద్ధమవుతున్నాయి. నిజానికి, ఎన్నికలకు రెండు మూడు నెలలు మహా అయితే,ఐదారు నెలల ముందు నుంచి రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలు మొదలు పెడతాయి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నికకు పరుగులు తీయడమే ఇప్పటి ఎన్నికల ప్రత్యేకతగా మారి పోయింది. ఐదు రాష్ట్ర్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మర్నాడే, ప్రధాని నరేంద్ర మోడీ ఈ సంవత్సరం చివర్లో జరిగే, గుజరాత్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మరో వంక ఢిల్లీ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ మొదలు పెట్టింది. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఇతర నేతలు కాంపెయిన్ మొదలు పెట్టారు. అదలా ఉంటే, తెలంగాణలో ఇప్పటికే అధికార తెరాస, ఎన్నికల వ్యూహకర్త పీకే (ప్రశాంత్ కిశోర్)ని హైర్ చేసుకుంది. పీకే,ఆయన బృందం రంగంలోకి దిగిపోయింది. సర్వేలు చేస్తోంది. మరోవంక కాంగ్రెస్ పార్టీ కూడా పీకే బృందం మాజీ సభ్యుడు, సునీల్ కొనుగోలు’ ను వ్యూహకర్తగా నియమించుకుంది. గతంలో తమిళనాడులో అన్నా డిఎంకే’కు పనిచేసిన సునీల్ బృందం మరి కొద్ది రోజుల్లో హైదరాబాద్’లో ల్యాండ్ అవుతుందని, అంటున్నారు. అదలా ఉంటే, బీజేపీ కూడా, యూపీలో బీజేపీకి పనిచేసిన వ్యుహకర్తల బృందాన్ని, రంగంలోకి దిచుతోందని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్రాతోలలో అధికారాన్ని నిలుపుకున్న, బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఏపీ తెలంగాణ రాష్ట్రాలే’ అని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు దండయాత్రకు సిద్దమవుతున్నారు. మరో వంక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పాదయత్ర ముహూర్తం ఖరారైంది. అదలా ఉంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో ఎన్నికలు అయ్యే కొద్దీ, బీజేపీ పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ తెలంగాణనను హస్తగతం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా వ్యూహాత్మకంగా పావులు కడుపుతోందని అందులో భాగంగానే యూపీ డబుల్ ఇంజిన్ బుల్డోజర్’ను రాష్ట్రంలో దింపు తున్నామని పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే,బీజేపీకి రెండంకెల సంఖ్యలో సీట్లు వచ్చినా, మళ్ళీ ప్రస్తుత పరిస్థితే పునరావృతం అవుతుందని, కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరిగినా అధికారాన్ని అందుకోవడం కష్టమే అని అంటున్నారు. తెరాస, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, ఎంఐఎం మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పటు చేసే అవకాశమే ఉంటుందని అంటున్నారు. అదే జరిగి ఒక సారి తెరాస అధికారంలోకి వస్తే, ఏమి జరుగుతుందో, వేరే చెప్పా నక్కరలేదని పరిశీలకులు అంటున్నారు. గత రెండు ఎన్నికలలోనూ కాంగ్రెస్ పార్టీ రెండు పదులకు కొంచెం అటూ ఇటుగా సీట్లు గెలుచుకుంది. కానీ, రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలలో మూడింట రెండు వంతుల మంది పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో, చేరారు. మరోసారి కూడా అదే పరిస్థితి ఉండాలాని తెరాస, కేసీఆర్ కోరుకుంటున్నారు అందుకే బీజేపీని లేపి,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.అయితే, ముందస్తుకు వెళ్ళినా ఎన్నికలకు ఇంకా తక్కువలో తక్కువ సంవత్సరం సమయం వుంది. ఈ లోగా ఏదైనా ..జరగ వచ్చును. మరో ప్రాంతీయ పార్టీ తెర మీదకు వచ్చి ఈక్వేషన్స్ తారు మారు చేసినా చేయవచ్చును, అంటున్నారు