YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ లో వీర విధేయుల ఫోరం

కాంగ్రెస్ లో వీర విధేయుల ఫోరం

హైదరాబాద్, మార్చి 16,
 తెలంగాణ కాంగ్రెస్’లో ఓ వంక జోష్ పెరుగుతోంది. రేవంత్ రెడ్డి పీసేసీ అధ్యక్షుడు మొదలు, కార్యకర్తల ముందు ఏదో ఒక అందోళన కార్యక్రమాన్ని ఉంచి, ఉత్సాహం నింపుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవ‌ల‌ కొల్లాపూర్‌లో భారీ సభను నిర్వహించారు. సభ సక్సెస్ అయింది. కార్యకర్తల్లో జోష్ పెరిగింది. అయితే, ఇదే సమయంలో పార్టీ సీనియర్లు కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు, కొల్లాపూర్‌ వేదిక నుంచి పాదయాత్ర ప్రకటన చేయడాన్ని తప్పు పడుతున్నారు. పీసీసీ, రాజకీయ సలహ కమిటీలో చర్చించకుండా, రేవంత్ రెడ్డి ఏక పక్షంగా ఎలా పాదయాత్ర ప్రకట్న చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదొక ఉదాహరణ మాత్రమే, టీపీసీసీలో తరచూ తెరమీదకు వస్తున్న అతర్గత కుమ్ములాటలు, జూనియర్ సీనియర్ విబేధాలు పార్టీని బలహీన పరుస్తున్నాయి. ఈ అన్నిటినీ మించి జాతీయ స్థాయిలో, పార్టీ అధిష్టానం సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, ఐదుకు ఐదు రాష్ట్రాల్లో  కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పంజాబ్’లోనూ అధికారం ‘చేజారి’పోయింది. దీంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏమిటనే చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో, ఐదు రాష్ట్రాల ఓటమి పై ఐదు గంటలు చర్చలు అయితే జరిగింది కానీ, చివరకు రాజీవ్ గాంధీ జయతి  ( ఆగష్టు 20) నాటికి పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని, ప్రస్తుతానికి స్టేటస్ కో’ యథాతథ స్థితినే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. మరోవంక జీ 23 అసమ్మతి వర్గం నాయకులు, సంస్థాగత సంస్కరణలు వెంటనే చేపట్టాలని పట్టు పడుతున్నారు.ఏ నేపధ్యంలో, టీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ గురించి చర్చినేందుకు,  మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో సమావేశం కావడం పార్టీ వర్గాల్లో ఆశక్తి రేకెతిస్తోంది. కాంగ్రెస్‌ విధేయుల ఫోరం పేరిట నిర్వహించిన భేటీలో  కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు, గీతారెడ్డి, కోదండరెడ్డి, జగ్గారెడ్డి, కమలాకర్ రావు, జీ నిరంజన్, శ్యామ్ మోహన్ తోపాటు సుమారు 15మంది వరకు సీనియర్ నాయకులతో పాటుగా, మరి కొందరు క్రింది స్థాయి కీలక నాయకులు  హాజరయ్యారు.అయితే, ఈ సమావేశంలో, జాతీయ పరిణామాలతో పాటుగా, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై కూడా చర్చించినట్లు సమాచారం. నిజానికి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్’ నాయకులు చాలా వరకు రేవంత్ నియామకాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. నిరసన గళాలను వినిపిస్తూనే ఉన్నారు. గతంలోనూ రేవంత్ వ్యతిరేక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పీసీసీ తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించారు. అయితే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ముందుకెళ్తున్నట్లు భావిస్తున్న వీరంతా పీసీసీకి తగిన రీతిలో సలహాలు, సూచనలు చేయాలా? లేదంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేలా అనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు కొందరు నేతలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ నుంచి వచ్చినవారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ఈ నేతలు బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకుందాం’ అంటూ ఢిల్లీకి వెళ్లి, రేవంత్ రెడ్డి అధ్యక్ష పదివి నుంచి తప్పించే విధంగా అధిష్టానం పై వత్తిడి తెచ్చే ఆలోచనలో సేనియర్లు ఉన్నారని తెలుస్తోంది. ఇదలా ఉంటే, పంజాబ్ పరిణామాలే, తెలంగాణలోనూ పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని,రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, ఈ పరిస్థితికి  రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కల్చర్ అర్థం కాకపోవడం కూడా ఒక కారణమని, రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ అధ్యక్షుని తరహాలో వ్యవహరించడం వల్లనే సమస్యలు వస్తున్నాయని అంటున్నారు.

Related Posts