YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రైల్వే సౌకర్యాలు మెరుగుపరచాలి ఎంపి కేశినేని నాని

రైల్వే సౌకర్యాలు మెరుగుపరచాలి ఎంపి కేశినేని నాని

ఆంధ్ర ప్రదేశ్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమలు మరియు విజయవాడ రైల్వే స్టేషన్ లో సౌకర్యాలను మెరుగుపరచాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు  కేశినేని శ్రీనివాస్(నాని)  లోక్ సభలో ప్రధాన అంశంగా ప్రస్తావించారు. బుధవారం  జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మన రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యలను సౌత్ కోస్ట్ రైల్వే జోన్లు పనితీరు గురించి ఎంపి మాట్లాడుతూ రాష్ట్ర విడిపోయేటప్పుడు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి  మోడీ  కూడా హామీ ఇవ్వడం జరిగింది, 27 ఫిబ్రవరి 2019లో ఆంధ్ర రాష్ట్రానికి సౌత్ రైల్వే జోన్ ప్రకటించారు. అప్పటినుంచి ఇప్పటివరకు రైల్వే జోన్ అంశం పనితీరు ఆచరణ లోకి ఎప్పుడు వస్తుంది ఇంతకు రైల్వే జోన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి పార్లమెంట్ సాక్షిగా కేశినేని నాని గారు  రైల్వే మంత్రిని నిలదీశారు. దీనికి సమాధానంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ  సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కి మా ప్రభుత్వము కట్టుబడి ఉన్నామని ఇప్పటికే బిల్డింగ్ నిర్మాణానికి కావాల్సిన స్థలం, డి పి ఆర్ వంటి పనులు జరుగుతున్నాయని త్వరలోనే సౌత్ కోస్ట్ రైల్వే జోన్  ఆచరణలో ఉంటుందని పనితీరు, మంత్రి సమాధానమిచ్చారు.
కేశినేని నాని  రెండో ప్రశ్నగా  విజయవాడ రైల్వే స్టేషన్ సౌకర్యాలను మెరుగుపరచాలని,నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ విజయవాడ నగరంలో మనదేశంలో4వ అతి ప్రాచీనమైన రైల్వేస్టేషన్లో విజయవాడ రైల్వే స్టేషన్ ఓ క టి. కాన్పూరు,హౌరా మరియు ఢిల్లీ తర్వాతి స్థానమే విజయవాడ, మొఘల్ సరై తర్వాత అత్యధికంగా రద్దీగా ఉండే రెండో రైల్వే స్టేషన్ 256 ప్యాసింజర్ రైలు 140 గూడ్స్ రైలు ప్రతిరోజు 1.4 లక్షల ప్రయాణికులతో సంవత్సరానికి ఐదు కోట్ల విజయవాడ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణం కొనసాగిస్తుంటారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఇలాంటి రైల్వే స్టేషన్లు చాలా తక్కువ సౌకర్యాలతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారని ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ లాగా సౌకర్యాలు కల్పించాలని స్పీకర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. మంత్రి  స్పందిస్తూ పార్లమెంట్ సభ్యులు లేవనెత్తిన పరిగణలోకి తీసుకుంటామని తెలియ జేశారు.

Related Posts