హైదరాబాద్
హైదరాబాద్ గాంధీభవన్ వద్ద విద్యార్థి నాయకుల సమావేశం కావడంతో ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. టీఎస్పీ ఎస్సి కార్యాలయం ముట్టడి కి విద్యార్థులు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గాంధీభవన్ రెండు గేట్ల నుంచి దూసుకుపోయారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్దులు గేట్లను తోసేసి బయటకు వెళ్లారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని అందోళనకారులు డిమాండ్ చేసారు.